నల్లధనాన్ని వెలికితీసేందుకు, ఉగ్ర నిధులను అరికట్టేందుకు రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్రమోదీ సంచలన ప్రకటన చేశారు. ఆ లక్ష్యాన్ని మనం చేరుకున్నామా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు పట్టుబడిన నకిలీ (ఫేక్) నోట్లలో రూ.2000 విలువైన నోట్లు 56 శాతం కావడమే దీనికి నిదర్శనం. అందునా అత్యధికం గుజరాత్ రాష్ట్రంలోనే పట్టుబడటం గమనార్హం.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నల్లధనం వెలికి తీయడానికి 2016 నవంబర్ ఎనిమిదో తేదీన నాటి రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానే రూ.2000, రూ.500 నోట్లను చలామణిలోకి తెచ్చారు. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం అయితే ఆ తర్వాత ఏడాది 2017-18లో దేశంలో పట్టుకున్న నకిలీ నోట్లలో 56 శాతం రూ.2000 విలువైన నోట్లే కావడం గమనార్హం.
also read ట్రేడ్ వార్‌కు తెర.. టారిఫ్‌లు యధాతథం
అదనపు భద్రతా ఫీచర్లతో 2000 విలువైన నోట్లు విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. 2017, 2018 సంవత్సరాల్లో పట్టుబడిన నకిలీ కరెన్సీ విలువ రూ.46.06 కోట్లు. అందులో 56.31 నోట్లు రూ.2000 నోట్లేనని ఎన్సీఆర్బీ నివేదికలో తేలింది.2017లో రూ.28.10 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని దర్యాప్తు అధికారులు పట్టుకుంటే అందులో 53.30 శాతం, 2018లో పట్టుకున్న నకిలీ నోట్లలో 61.01 శాతం రూ.2000 నోట్లే. పట్టుబడ్డ నకిలీ నోట్లలో అత్యధికం గుజరాత్ రాష్ట్రం నుంచే ఉన్నాయి.
2019లో గుజరాత్ రాష్ట్రంలో 34,680 నోట్లు రూ.2000 విలువైనవి. నోట్ల రద్దు తర్వాత గుజరాత్లో పట్టుబడిన నకిలీ నోట్లు దేశమంతా కలిపితే 26.28 శాతం. తర్వాతీ జాబితాలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. జార్ఖండ్, మేఘాలయ, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం ఒక్క రూ.2000 నోటు కూడా నకిలీ నోట్ దొరకలేదు.
2016లో చివరి 52 రోజుల్లో రూ.2000 విలువైన 2,272 నోట్లు నకిలీవి పట్టుబడ్డారు. అంటే దీని మొత్తం విలువ రూ.45.44 లక్షలు. ఇందులో గుజరాత్ రాష్ట్రం వాటా 57 శాతం. 2016 నవంబర్ 18వ తేదీన కర్ణాటకలోని మైసూర్ నగరంలో 2000 విలువైన 44 నోట్లు నకిలీవి పట్టుబడ్డాయి. హైదరాబాద్, మీరట్, బెంగళూరు, రాజ్ కోట్ తదితర ప్రాంతాల్లోనూ రూ.2000 విలువైన నకిలీ నోట్లు దర్యాప్తు అధికారులకు చిక్కాయి.
also read మార్కెట్లో చైనా- అమెరికా ట్రేడ్‌వార్ జోష్.. స్టాక్స్ @ 42కే.. బట్
గమ్మత్తేమిటంటే ఎన్సీఆర్బీ ‘క్రైం ఇన్ ఇండియా’ అనే నివేదికలో పేర్కొన్న ఫేక్ కరెన్సీ కంటే తక్కువగా నకిలీ నోట్లు దొరికాయని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నివేదించింది. 2018-19లో ఇదే ధోరణి నెలకొంది. 2017-18లో రూ.2000 విలువైన 17,929 నకిలీ నోట్లు దొరికాయని ఆర్బీఐ తెలిపింది. 2018-19లో రూ.2000 విలువైన నోట్లు 21,847 ఉన్నాయని, అవి మొత్తం దొరికిన నకిలీ నోట్లలో రూ.2000 నోట్లు 21.9 శాతం అని ఆర్బీఐ తెలిపింది.
మరో ప్రజావేగు నివేదిక ప్రకారం నూతన రూ.500 నోట్లలో నకిలీ నోట్లు 121 శాతం ఉన్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే ఆర్బీఐ రూ.2000 విలువైన నోట్ల ముద్రణ భారీగా తగ్గించిందని మీడియాలో వార్తలొచ్చాయి. 2016-17లో 3,542.991 మిలియన్ల రూ.2000 నోట్లు ముద్రించినట్లు, 2017-18లో 111.507 మిలియన్ల రూ.2000 నోట్లు ముద్రించినట్లు సమాచార హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ఒక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌లో ఆర్బీఐ రూ.2000 నోట్ ముద్రణ తగ్గించినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో 46.690 మిలియన్ల రూ.2000 నోట్లను ఆర్బీఐ ముద్రించింది.