
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం బెంచ్‌మార్క్ రెపో రేటు 4 శాతంగా నిర్ణయించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) వరుసగా 11వ సారి కీలక వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించింది. ఏప్రిల్ 6న మానిటరీ పాలసీ సమీక్ష ప్రారంభం కాగా, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ఆర్‌బీఐ ప్రకటించింది. వాస్తవానికి వడ్డీ రేటును చారిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద తగ్గించడం ద్వారా డిమాండ్‌ను పెంచడానికి, RBI తన పాలసీ రెపో రేటు లేదా స్వల్పకాలిక రుణ రేటును మే 22, 2020న చారిత్రాత్మక కనిష్ట స్థాయికి తగ్గించింది.
తాజా ఎంపీసీ సమీక్షలోనూ కమిటీ వడ్డీ రేట్లును స్థిరంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. రివర్స్ రెపో రేటు కూడా 3.35 శాతం వద్దనే కొనసాగుతోంది. దీని వల్ల లోన్ పొందే వారికి ఊరట కలుగనుంది. అంతే కాదు చౌక వడ్డీ రేట్లకే రుణాలు అందుబాటులోకి రానున్నాయి. అదేసమయంలో బ్యాంక్ ఖాతాదారులకు మాత్రం తక్కువ వడ్డీ లభిస్తుంది.
ఇక ఆర్బీఐ సమీక్షలో కీలక అంశాలు ఇవే..
>> ఇప్పుడు కరోనా మహమ్మారి సంక్షోభం దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గడిచిన రెండేళ్లుగా అనేక టెక్టోనిక్ మార్పులను ఎదుర్కొంది. అటు ఉక్రెయిన్ యుద్ధంతో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేశాయని RBI గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
>> గవర్నర్ దాస్ ప్రకారం, యుద్ధం ఆర్థిక పునరుద్ధరణను అడ్డుకుంటుందని పేర్కొన్నారు. అంతేకాదు ఆర్‌బిఐ ఎఫ్‌వై 23 వృద్ధి అంచనాను 7.2 శాతానికి తగ్గించింది.
>> మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటు రెండూ 4.25 శాతంగా ఉన్నాయి.
>> గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు అస్థిరంగా ఉన్నాయని RBI గవర్నర్ దాస్ పేర్కొన్నారు.
>> మార్కెట్‌లో స్థిరమైన ఆర్థిక వాతావరణాన్ని నిర్వహించడానికి RBI పని చేస్తుందని, గ్లోబల్ స్పిల్‌ఓవర్ల రియాక్షన్ ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. .
>> అంతే కాదు మహమ్మారి ప్రభావాల నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద ఉంచాలని ఎంపీసీ నిర్ణయించింది.
>> FY23లో ద్రవ్యోల్బణం గతంలో అంచనా వేసిన 4.5 శాతం నుంచి 5.7 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
>> భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన విదేశీ మారక నిల్వలతో పుంజుకుంది మరియు దాస్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి సిద్ధంగా ఉంది. దృఢంగా ఉందని దాస్ తెలిపారు.
>> గ్రామీణ డిమాండ్ కోసం రబీ పంటకు మద్దతు ఇవ్వాలని సూచించారు.