Gold Priced Down: మహిళలకు గుడ్ న్యూస్ బంగారం ధర భారీగా పడిపోయే చాన్స్...తులం ఎంతో తెలిస్తే షాకే..

Published : Apr 08, 2022, 12:07 PM IST
Gold Priced Down: మహిళలకు గుడ్ న్యూస్ బంగారం ధర భారీగా పడిపోయే చాన్స్...తులం ఎంతో తెలిస్తే షాకే..

సారాంశం

బంగారం ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సంక్షోభం ప్రభావం తగ్గుతున్న నేపథ్యంతో పాటు, యూఎస్ బాండ్ యీల్డ్స్ పై వడ్డీ పెరగడం కూడా బంగారం ధగధగ తగ్గించేందుకు దోహదపడుతుంది. 

ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే దీని వెనుక కారణం లేకపోలేదు. ప్రధానంగా యూఎస్ బాండ్ యీల్డ్స్ రాబడులు పెరగడంతో ఒక్కసారిగా బంగారం పెట్టుబడుల నుంచి ఇన్వెస్టర్లు బయటకు వస్తున్నారు,. దీంతో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ నిధులు బాండ్స్ కొనేందుకు కేటాయిస్తున్నారు. అది కూడా బంగారం ధరల తగ్గుదలకు దారితీస్తోంది. దీంతో సహజంగానే పసిడి మార్కెట్ తిరోగమనం బాట పడుతోంది.

ఇక యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ భేటీలో తీసున్న చర్యల అనంతరం డాలర్ మారకం విలువ బలపడింది. దీంతో ఇతర కరెన్సీల ద్వారా బంగారం కొనుగోలు చేసేవారికి ఇది బంగారం ఖరీదు అయ్యింది. దీంతో బంగారం డిమాండ్ తగ్గే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఉక్రెయిన్, రష్యా యుద్ధం కూడా సంధి దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్ మెంట్లను ఈక్విటీ మార్కెట్ల వైపు తరలిస్తున్నారు.

అది కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈమేరకు క్వాంటం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పేర్కొంది. నిజానికి ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి ఉంటేనే పసిడి ధరలు పెరుగుతుంటాయి. లేకపోతే, సాధారణ స్థితిలో ఉంటాయి.  

ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం ఏర్పడినప్పుడు గోల్డ్ రేట్లు బాగా పెరుగుతాయి. అనిశ్చితి వాతావరణం లేకపోతే గోల్డ్ రేట్లు తగ్గుతాయి. దేశంలో గోల్డ్ రేట్లు బుధవారం కూడా తగ్గాయి. ఎంఎసీఎక్స్  మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ (10 గ్రాముల) రేటు  రూ. 51,360 గా ఉంది. కేజీ  Silver రూ. 66,075 దగ్గర ట్రేడవుతోంది.

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలై  నెల గడచింది. ఈ సంక్షోభం తగ్గుదల స్థితికి చేరిందని  క్వాంటమ్ ఏఎంసీ  సీఐఓ చిరాగ్ మెహతా పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో  గోల్డ్ రేట్లు తగ్గినా, మీడియం నుంచి లాంగ్ టర్మ్ రేంజులో మాత్రం  బంగారం ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు.  

గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడ్డుగా ఫెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..
వడ్డీ రేట్లను పెంచడంతో పాటు మానిటరీ పాలసీని  వేగంగా సాధారణ స్థాయికి తీసుకురావాల్సి ఉందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు గవర్నర్  లేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రైనార్డ్  ఇప్పటికే  పేర్కొన్నారు. దీంతో యూఎస్ 10 ఇయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్ అయిన 2.5 శాతాన్ని క్రాస్ చేసింది. US బాండ్ యాల్డ్ లు  పెరగడంతో పాటు, ఫెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానిటరీ పాలసీలో రేట్ల పెంపు ఉంటుందనే అంచనాలు ఈ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గడానికి కారణమవుతున్నాయని  మెహతా ఈక్విటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలాంత్రి అన్నారు.

ఈ ఏడాది మరో ఆరు సార్లు వడ్డీ రేట్లను పెంచాలని ఫెడ్ చూస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి కీలక  వడ్డీ రేట్లను ప్రస్తుతం ఉన్న 0.25 %  నుంచి 2.5 శాతానికి పెంచాలని ఆలోచనలో ఉంది. యూఎస్ ఎకానమీ మెరుగ్గా లేకపోవడంతో బంగారానికి సపోర్ట్  దొరుకుతుందని  ఎనలిస్టులు అంటున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !