డెన్మార్క్ స్టీస్‌డాల్‌తో భాగస్వామ్యంతో పాటు జర్మనీలోని నెక్స్‌వెఫ్‌లో రిలయన్స్ భారీ పెట్టుబడి..

Ashok Kumar   | Asianet News
Published : Oct 13, 2021, 08:54 PM IST
డెన్మార్క్ స్టీస్‌డాల్‌తో  భాగస్వామ్యంతో పాటు జర్మనీలోని నెక్స్‌వెఫ్‌లో రిలయన్స్ భారీ పెట్టుబడి..

సారాంశం

ఈ రిలయన్స్ పెట్టుబడి  NexWafe కోసం ప్రాడక్ట్, టెక్నాలజి అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. దీనితో సహ  ఫ్రీబర్గ్‌లోని ప్రోటోటైప్ లైన్‌లపై నెక్స్‌వేఫ్  సోలార్ ఫోటోవోల్టాయిక్ ఉత్పత్తుల కమర్షియల్ అభివృద్ధిని పూర్తి చేస్తుంది.

ఇంధన రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మరో భారీ ఒప్పందం చేసుకుంది. జర్మనీలోని నెక్స్‌వఫే  GmbH (NexWafe) మంగళవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL)ని తన ప్రధాన పెట్టుబడిదారుగా ప్రకటించింది. ఇందుకు మొదటి దశలో 25 మిలియన్ యూరోల పెట్టుబడి ($ 29 మిలియన్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది.

ఈ రిలయన్స్ పెట్టుబడి  NexWafe కోసం ప్రాడక్ట్, టెక్నాలజి అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. దీనితో సహ  ఫ్రీబర్గ్‌లోని ప్రోటోటైప్ లైన్‌లపై నెక్స్‌వేఫ్  సోలార్ ఫోటోవోల్టాయిక్ ఉత్పత్తుల కమర్షియల్ అభివృద్ధిని పూర్తి చేస్తుంది.

ఈ భాగస్వామ్యం ద్వారా రిలయన్స్ నెక్స్‌వేఫ్  ప్రొప్రైటరీ టెక్నాలజికి అక్సెస్ పొందుతుంది ఇంకా నెక్స్‌వేఫ్  టెక్నాలజి ఉపయోగించి భారతదేశంలో పెద్ద ఎత్తున వెఫర్ తయారీ సౌకర్యాలను నిర్మించాలని యోచిస్తోంది.

నెక్స్‌వేఫ్  చవకైన ముడి పదార్థాల నుండి నేరుగా  మోనోక్రిస్టలైన్ సిలికాన్ వెఫార్స్ అభివృద్ధి, ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రేప్రైటరీ ప్రక్రియ పాలిసిలికాన్ ఉత్పత్తి, ట్రెడిషనల్ వెఫర్ తయారీపై ఆధారపడిన ఇంగోట్ పుల్లింగ్ వంటి ఖరీదైన, శక్తితో కూడిన ఇంటర్మీడియట్ దశల అవసరాన్ని తొలగిస్తుంది.

also read జీ అండ్ ఇన్వెస్కో మధ్య వివాదంలో చిక్కుకున్నందుకు చింతిస్తున్నాము: రిలయన్స్

దీని పేటెంట్ టెక్నాలజి వెఫర్ ప్రొడక్షన్ ఖర్చులను భారీగా తగ్గిస్తుందని భావిస్తున్నారు, అలాగే సోలార్ ఫోటోవోల్టాయిక్‌లను పునరుత్పాదక శక్తి అతి తక్కువ ధరతో తయారు చేస్తారు. నెక్స్‌వేఫ్ లో రిలయన్స్ పెట్టుబడులు భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రశ్రేణి గ్రీన్ ఎనర్జీ ప్రొవైడర్‌గా తీర్చిదిద్దే లక్ష్యాన్ని మరింత నొక్కి చెప్పాయి.

నెక్స్‌వేఫ్  మోనోక్రిస్టలైన్ సిలికాన్ వేఫర్‌లను తయారు  చేస్తుంది, ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఈ‌ఎన్‌ఎల్ ( RNESL) 86,887 సిరీస్-సి నెక్స్‌వేఫ్  ప్రాధాన్యత కలిగిన షేర్లను EUR 287.73 చొప్పున కొనుగోలు చేస్తామని తెలిపింది. సెమీకండక్టర్లలో ఉపయోగించే మోనోక్రిస్టలైన్ సిలికాన్ వెఫర్లను నెక్స్‌వేఫ్  తయారు చేస్తుంది. సెమీకండక్టర్స్ అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలలో పనిచేస్తాయి.

రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, 'రిలయన్స్ ఎల్లప్పుడూ టెక్నాలజీలో ముందు వరుసలో ఉంటుందని నమ్ముతారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ సరసమైన గ్రీన్ ఎనర్జీ అవసరాలను తీర్చడానికి మేము ప్రతిష్టాత్మక మిషన్‌ను ప్రారంభిస్తున్నామని నెక్సాఫ్‌తో మా భాగస్వామ్యం మరోసారి నిరూపిస్తుంది. నెక్సాఫ్‌లో మా పెట్టుబడి ఫోటోవోల్టాయిక్ తయారీలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా స్థాపించడానికి ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు.


అలాగే రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్‌లను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి డానిష్ కంపెనీ స్టీస్‌డాల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుందని రిలయన్స్ తెలిపింది. ఇటీవల డానిష్ ప్రధాని మెట్టే ఫ్రెడ్రిక్సన్ భారతదేశ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు