జీ అండ్ ఇన్వెస్కో మధ్య వివాదంలో చిక్కుకున్నందుకు చింతిస్తున్నాము: రిలయన్స్

By asianet news teluguFirst Published Oct 13, 2021, 7:35 PM IST
Highlights

 "ఫిబ్రవరి/ మార్చి 2021లో ఇన్వెస్కో మా ప్రతినిధులు, వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు అండ్ జీ మేనేజింగ్ డైరెక్టర్ పునిత్ గోయెంకా మధ్య నేరుగా చర్చలు జరపడానికి రిలయన్స్‌కి సహాయపడింది" అని తెలిపింది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ బుధవారం తన మీడియా ఆస్తులను జీతో విలీనం చేయడానికి కొన్ని నెలల క్రితం ప్రతిపాదన చేసిందని అయితే జీ వ్యవస్థాపకుల వాటాపై విభేదాల కారణంగా దీనిని వదులుకున్నట్లు తెలిపింది.

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్  అతిపెద్ద వాటాదారు టెలివిజన్ కంపెనీ అదృష్టాన్ని పునరుద్ధరించడానికి సహాయపడే సంస్థగా తెలిపిన  కొన్ని గంటల తర్వాత , బిలియనీర్ ముఖేష్ అంబానీ సంస్థ తన స్థానాన్ని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

"ఫిబ్రవరి/ మార్చి 2021లో ఇన్వెస్కో మా ప్రతినిధులు, వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు అండ్ జీ మేనేజింగ్ డైరెక్టర్ పునిత్ గోయెంకా మధ్య నేరుగా చర్చలు జరపడానికి రిలయన్స్‌కి సహాయపడింది" అని తెలిపింది. మా మీడియా ఆస్తులను జీతో విలీనం చేయడానికి మేము విస్తృత ప్రతిపాదన చేశాము అని వెల్లడించింది. జీ ఇన్వెస్కో మధ్య వివాదంలో చిక్కుకున్నందుకు చింతిస్తున్నామని, మీడియాలో వచ్చిన నివేదికలు ఖచ్చితమైనవి కాదని ఆర్‌ఐ‌ఎల్ తెలిపింది.

జీ, రిలయన్స్ మీడియా ప్రాపర్టీల విలువలు ఒకే పారామిటర్స్ ఆధారంగా వచ్చినప్పటికీ ఈ ప్రతిపాదన అన్ని విలీన సంస్థల బలాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. రిలయన్స్ గోయెంకాతో సహా ఇప్పటికే ఉన్న మ్యానేజ్మెంట్ నిలుపుకోవాలనుకుంది, కానీ జీలో అతిపెద్ద వాటాదారు అయిన గోయెంకా తొలగింపును  ఇన్వెస్కో కోరింది.

also read 2022లో భారత్ జిడిపి అంచనా 8.5 శాతం.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ మనదే

ఇన్వెస్టీ కంపెనీల ప్రస్తుత మేనేజ్మెంట్ కొనసాగించడానికి రిలయన్స్ ఎల్లప్పుడు ప్రయత్నిస్తుంది అలాగే వారి పర్ఫర్మేన్స్  కి రివార్డ్ చేస్తుంది. తదనుగుణంగా, ఈ ప్రతిపాదనలో గోయెంకాను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగించడం అలాగే  గోయెంకాతో సహా  ఈ‌ఎస్‌పి‌ఓ‌ఎస్ (ESPOs)ల జారీ చేయడం వంటివి ఉన్నాయి" అని పేర్కొంది. కానీ గోయెంకా, ఇన్వెస్కో మధ్య విభేదాలు తలెత్తాయి.  

వ్యవస్థాపకులు ఎల్లప్పుడూ మార్కెట్ కొనుగోళ్ల ద్వారా తమ వాటాను పెంచుకోవచ్చని పెట్టుబడిదారులు అభిప్రాయపడ్డారు అని ప్రకటనలో పేర్కొంది. రిలయన్స్‌లో మేము వ్యవస్థాపకులందరినీ గౌరవిస్తాము, ఎలాంటి శత్రు లావాదేవీలకు పాల్పడలేదు. కాబట్టి మేము ఇంకా ముందుకు కోనసాగలేదు.

ఈ సంవత్సరం ప్రారంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ల మధ్య చర్చలు ఫలించవచ్చని, మొదటిసారి భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ టెలివిజన్ దిగ్గజంపై ఆసక్తి ఉన్నారని వెల్లడిస్తు ఇన్వెస్కో తెలిపింది. జీ నుండి వచ్చిన ఆరోపణలను యూ‌ఎస్ పెట్టుబడి సంస్థ  ఇన్వెస్కో తిరస్కరించింది. జీలో 18% యాజమాన్యం ఉన్న యూ‌ఎస్ పెట్టుబడిదారుడు జీ బోర్డును పునరుద్ధరించాలని, కార్పొరేట్ గవర్నెన్స్ లాప్స్ అయ్యిందని ఆరోపిస్తూ సి‌ఈ‌ఓ పునిత్ గోయెంకాను తొలగించాలని పిలుపునిచ్చింది.

ఇన్వెస్కో జీ కంపెనీని స్వాధీనం చేసుకోవాలని పన్నాగం పన్నిందని, యూ‌ఎస్ పెట్టుబడిదారుల డిమాండ్‌లపై ఓటు వేయడానికి వాటాదారుల సమావేశానికి చేసిన అభ్యర్థనలను తోసిపుచ్చింది అలాగే దాని ప్రక్రియలను కఠినతరం చేసిందని జీ ఆరోపించింది.  
 

click me!