‘రిలయన్స్’ రికార్డుల జోరు.. రూ.12 లక్షల కోట్లు దాటేసిన సంస్థ ‘ఎం-క్యాప్’

By Sandra Ashok KumarFirst Published Jul 14, 2020, 10:29 AM IST
Highlights

కార్పొరేట్ దిగ్గజం ‘రిలయన్స్’ రికార్డుల మోత మోగిస్తున్నది. జియోలో పెట్టుబడులను ఆహ్వానించడంతోపాటు రైట్స్ ఇష్యూ ద్వారా సంస్థను రుణ రహితంగా తీర్చిదిద్దుతోంది రిలయన్స్ యాజమాన్యం.. ఈ నెల 15న సంస్ వార్షిక సాధారణ సభ్య సమావేశం (ఏజీఎం) భేటీ జరుగనున్న వేళ రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ.12 లక్షల కోట్లు దాటి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 
 

ముంబై: దేశీయ దిగ్గజ సంస్థ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ తాజాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ.12.09 లక్షల కోట్లు దాటింది. సోమవారం ఉదయం 11.38 గంటలకు ఈ షేర్ విలువ రూ.52.15 పెరిగి రూ.1930.35 ట్రేడ్ అవుతోంది. ఇప్పటివరకు భారతదేశ కార్పొరేట్ రంగ చరిత్రలో ఇంత మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు చేరుకోవడం ఓ రికార్డు. 

మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మొదలైనప్పుడు రిలయన్స్ షేర్ల విలువ భారీగా పడిపోయింది. ఒక దశలో రిలయన్స్ షేర్ విలువ రూ.1000లోపునకు పడిపోయింది. కానీ తర్వాత క్రమంగా పుంజుకున్నాయి. 

also read 

సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్’ సంస్థతో ఒప్పందం కుదిరిన తర్వాత రిలయన్స్ షేర్ విలువను పెంచుకున్నాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు రిలయన్స్ షేర్ల విలువ 120 శాతం పెరిగింది. 

దీనికి తోడు మార్చి 2021 నాటికి రిలయన్స్ సంస్థను రుణ రహిత సంస్థగా తీర్చి దిద్దుతామని ముకేశ్ అంబానీ ప్రకటించడం కూడా మదుపర్లలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. మరోవైపు ఆదివారం టెక్ దిగ్గజ సంస్థ క్వాల్ కామ్ కూడా రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. 

రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లో 0.15 శాతం వాటా కోసం రూ.730 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు క్వాల్ కామ్ తెలిపింది. దీంతో జియో డిజిటల్ సర్వీసెస్ సంస్థలో పెట్టుబడి పెట్టిన 12వ సంస్థగా నిలిచింది. ఈ ఒప్పందం పూర్తయితే రిలయన్స్ జియోలో 25.24 శాతం వాటాలను విక్రయించినట్లవుతుంది. 
 

click me!