గుడ్ న్యూస్: కేవలం 75 రూపాయలకే కరోనా వైరస్ మెడిసిన్..

By Sandra Ashok KumarFirst Published Jul 13, 2020, 6:10 PM IST
Highlights

గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ గత నెలలో ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌ టాబ్లెట్‌ను రూ .103 చొప్పున విడుదల చేసింది.  తేలికపాటి నుంచి సాధారణ లక్షణాలుగల కోవిడ్ -19 ఉన్న రోగులకు చికిత్స కోసం ఇచ్చే ఈ టాబ్లెట్‌ ధరను 27 శాతం తగ్గించి రూ.75 అందించనుంది.

న్యూ ఢిల్లీ: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనావైరస్ ఇప్పటికే ఎంతో మందిని బలితీసుకుంది. ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటి నుంచి దీని అరికట్టేందుకు  ఔషడం తయారీ, క్లినికల్స్ ట్రయల్స్ నివహిస్తున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ నయం చేయడానికి  గ్లెన్‌మార్క్ ఫార్మా సంస్థ ఫాబిఫ్లూ అనే టాబ్లెట్‌ కనిపెట్టింది.

తేలికపాటి నుంచి సాధారణ లక్షణాలుగల కోవిడ్ -19 ఉన్న రోగులకు చికిత్స కోసం ఇచ్చే ఈ టాబ్లెట్‌ ధరను 27 శాతం తగ్గించి రూ.75 అందించనుంది. గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ గత నెలలో ఫాబిఫ్లూ టాబ్లెట్‌ను రూ.103 చొప్పున విడుదల చేసింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో గ్లెన్‌మార్క్ ఫాబిఫ్లూ ధరను 27 శాతం తగ్గింస్తున్నట్లు ప్రకటించింది.

కొత్త గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‌పి) ప్రతి ట్యాబ్‌కు రూ .75గా ఉండనుంది. "అధిక డిమాండ్, ఉత్పత్తి కారణంగా  ధరల తగ్గింపు సాధ్యమైంది, ఎందుకంటే ఔషధ పదార్ధం (ఎపిఐ), సూత్రీకరణలు రెండూ భారతదేశంలోని గ్లెన్‌మార్క్ సంస్థలో తయారు చేయబడింది, దీని ప్రయోజనాలు దేశంలోని కరోనా రోగులకు తమ ఔషధం మరింత చేరువవుతుందని "ఫైలింగ్ లో తెలిపింది. 

"మా ఇంటర్నల్ రిసెర్చ్ చూపించింది ఏంటి అంటే  ఇతర దేశాలలో ఆమోదం పొందిన ఫావిపిరవిర్ ఖర్చుతో పోల్చితే మేము భారతదేశంలో ఫాబిఫ్లూను అతి తక్కువ మార్కెట్ ఖర్చుతో ప్రారంభించామని, ఇప్పుడు మరింత ధర తగ్గింపుతో రోగులకు మరింత అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నట్లు  గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్- ఇండియా బిజినెస్ అలోక్ మాలిక్ అన్నారు.

జూన్ 20న, గ్లెన్‌మార్క్ ఫాబిఫ్లూ కోసం భారతదేశంలో డ్రగ్ రేగులేటర్ నుండి తయారీ, మార్కెటింగ్ కోసం ఆమోదం పొందినట్లు ప్రకటించింది. ఇది తేలికపాటి నుండి సాధారణ లక్షణాలు ఉన్న కోవిడ్-19 చికిత్స కోసం భారతదేశంలో ఫావిపిరవిర్ ఆమోదించిన మొట్టమొదటి మందుగా నిలిచింది.

గ్లెన్‌మార్క్ ఫేవిపిరవిర్ (ఫాబిఫ్లూ) తో ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్ ను భారతదేశంలో తేలికపాటి నుండి సాధారణ లక్షణాలు ఉన్న కోవిడ్-19 రోగులతో పూర్తి చేసింది. ట్రయల్ ఫలితాలు త్వరలో లభిస్తాయని కంపెనీ తెలిపింది.

భారతదేశంలో ఎక్కువగా ఆసుపత్రిలో చేరిన కోవిడ్-19 రోగులలో కాంబినేషన్ థెరపీగా రెండు యాంటీవైరల్స్ డ్రగ్స్ ఫావిపిరవిర్, ఉమిఫెనోవిర్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి గ్లెన్‌మార్క్  మరొక దశ క్లినికల్ ట్రయల్ 3  నిర్వహిస్తోంది. గ్లెన్‌మార్క్ ఫార్మా షేర్లు బిఎస్‌ఇలో 1.34 శాతం తగ్గి రూ .421.00 వద్ద ట్రేడవుతున్నాయి.
 

click me!