రిలయన్స్ రిటైల్ ప్రీమియం ఫ్యాషన్-లైఫ్‌స్టైల్ స్టోర్.. జారా, మ్యాంగోకి పోటీగా అజోర్టే..

Published : Sep 30, 2022, 07:01 PM ISTUpdated : Sep 30, 2022, 07:06 PM IST
  రిలయన్స్ రిటైల్  ప్రీమియం ఫ్యాషన్-లైఫ్‌స్టైల్ స్టోర్.. జారా, మ్యాంగోకి  పోటీగా అజోర్టే..

సారాంశం

రిలయన్స్ బెంగుళూరులోని 1 MG-లిడో మాల్‌లో మొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్ 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అలాగే రాబోయే నెలల్లో మరిన్ని స్టోర్లను తెరవాలని కంపెనీ యోచిస్తోంది.

రిలయన్స్ రిటైల్ గురువారం బెంగళూరులో ప్రీమియం ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ స్టోర్ బ్రాండ్ AZORTEని ప్రారంభించింది. వెస్టర్న్ అండ్ భారతీయ దుస్తులు కాకుండా చెప్పులు, ఫ్యాషన్ అక్సెసోరిస్, హోమ్, బ్యూటీ ప్రాడెక్ట్స్ ఇంకా మరిన్నింటిని విక్రయిస్తుంది.

రిలయన్స్ బెంగుళూరులోని 1 MG-లిడో మాల్‌లో మొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్ 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అలాగే రాబోయే నెలల్లో మరిన్ని స్టోర్లను తెరవాలని కంపెనీ యోచిస్తోంది.

" మిలీనియల్స్‌గా వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల విభాగాలలో మిడ్-ప్రీమియం ఫ్యాషన్ సెగ్మెంట్ ఒకటి. జెన్-జెడ్ అంతర్జాతీయ అండ్ భారతీయ ఫ్యాషన్‌లో సరికొత్తగా డిమాండ్ చేస్తోంది" అని రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ సెగ్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అఖిలేష్ ప్రసాద్ అన్నారు.

కొత్త స్టోర్ ఫార్మాట్‌లో స్మార్ట్ ట్రయల్ రూమ్‌లు, ఫ్యాషన్ డిస్కవరీ స్టేషన్‌లు, సెల్ఫ్-చెక్‌అవుట్ కియోస్క్‌లు వంటి టెక్-ఎనేబుల్ అనుభవాలను అందిస్తుంది. మంగళవారం రిలయన్స్ రిటైల్  ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ డిపార్ట్‌మెంటల్ స్టోర్ ఫార్మాట్ - రిలయన్స్ సెంట్రోను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

AZORTE వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్ రాకేష్ జల్లిపల్లి మాట్లాడుతూ, “AZORTE అనేది భారతదేశపు మొట్టమొదటి ఫ్యాషన్ నియోస్టోర్, ఇది ఆన్-ట్రెండ్ స్టైల్స్ ఇంకా క్లాసిక్‌ను తిరిగి ఆవిష్కరించిన హై-స్ట్రీట్ ఫ్యాషన్‌ను అందిస్తుంది అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Insurance Scheme: రోజుకు 2 రూపాయ‌ల‌తో రూ. 2 ల‌క్ష‌లు పొందొచ్చు.. వెంట‌నే అప్లై చేసుకోండి
మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు