మారబోతున్న గూగుల్ క్రోమ్ లోగో.. ఎనిమిదేళ్ల తర్వాత కొత్త మార్పు.. ఎలా ఉండబోతోందంటే...

Published : Feb 07, 2022, 11:48 AM IST
మారబోతున్న గూగుల్ క్రోమ్ లోగో.. ఎనిమిదేళ్ల తర్వాత కొత్త మార్పు.. ఎలా ఉండబోతోందంటే...

సారాంశం

గూగుల్ క్రోమ్ ఇప్పుడు సరికొత్తగా దర్శనమివ్వబోతోంది. లోగో కొత్త అందాలతో ముస్తాబవుతోంది. త్వరలోనే ఈ లోగో  డెస్క్ టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఎనిమిదేళ్ల తరువాత గూగుల్ ఈ సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది.

టెక్ దిగ్గజం Google కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్ బ్రౌజర్ Google Chrome లోగోను మార్చబోతోంది. 2014లో క్రోమ్ Logoలో స్వల్పంగా మార్పులు చేసిన గూగుల్.. ఇప్పుడు.. అంటే ఎనిమిదేళ్ల తర్వాత దాని డిజైన్ మార్చేస్తోంది. ఈ విషయాన్ని Social media వేదికగా వెల్లడించింది టెక్ దిగ్గజం.  గూగుల్ క్రోమ్ డిజైనర్ Elvin Hu తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేశారు.

మీరు ఈ రోజు క్రోమ్ కొత్త ఐకాన్ ను గమనించే ఉంటారు. ఎనిమిది ఏళ్ళ తర్వాత క్రోమ్ బ్రాండ్ ఐకాన్ ను రిఫ్రెష్ చేస్తున్నాం... అంటూ రాసుకొచ్చారు ఎల్విన్ హు... ఇక లోగో విషయానికి వస్తే.. పాత లోగోలో ఉన్నట్టుగా ఇప్పుడు కొత్త బ్రాండ్ ఐకాన్ లో షాడోలు లేకుండా చేశారు. అయితే లోగోలో కనిపించే ఆ పాత నాలుగు రంగులు మునుపటి కంటే ఇప్పుడు మరింత మెరుస్తున్నాయి. మధ్యలోని నీలిరంగు వృత్తం సైజును కొంచెం పెంచారు.

గూగుల్ ఆధునిక బ్రాండ్ వ్యక్తీకరణకు అనుగుణంగా ఈ మార్పులు చేయబడ్డాయని హు పేర్కొన్నారు. మరోవైపు విండోస్ సహా వివిధ ఆపరేటింగ్ సిస్టమ్ ల కోసం ఈ లోగోను తయారు చేసినట్టు హు వెల్లడించారు. డెస్క్ టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు అందరికీ కూడా ఈ లోగోలు త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. 

ఇదిలా ఉండగా, జనవరి 3న గూగుల్  క్రోమ్ తన యూజర్లకు కంపెనీలు హెచ్చరిక జారీ చేశాయి. మీరు మీ లాగిన్  ఐడి, పాస్వర్డ్ని గూగుల్ క్రోమ్ లో  సేవ్ చేసి ఉంచినట్లయితే జాగ్రత్త వహించాలని చెప్పుకొచ్చాయి. దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుందని తెలిపింది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో  ఇలాంటి సమస్యలు ఎదురుకోకుండా ఉండవచ్చు..

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ మోసాలు, హ్యాకింగ్ లకు సంబంధించిన సంఘటనలు భారీగా పెరిగాయి. దీంతో ఇంటర్నెట్ ను ఉపయోగించే వారు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి.  ఒక చిన్న పొరపాటు ఎన్నో సమస్యలను తెచ్చి పెడుతుంది. తరచుగా మనలో చాలామంది క్రోమ్ ఉపయోగిస్తున్నప్పుడు లాగ్ ఇన్ ఐడి, పాస్వర్డ్ ను అందులో సేవ్ చేస్తుంటారు. మీరు అలా చేస్తే వెంటనే అప్రమత్తంగా ఉండాలి.  అలా చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇటీవల కొంతమంది ఐటీ రంగ పరిశోధకులు వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. వారి ప్రకారం క్రోమ్ లో సేవ్ చేసిన లాగిన్ ఐ డి,  పాస్వర్డ్ హ్యాక్ అవ్వచ్చు.  మీ ప్రైవేట్ డేటా ఇంకా మీ కంపెనీ వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. కొంతకాలం క్రితం సెక్యూరిటీ ఉల్లంఘన కారణంగా ఒక కంపెనీకి చెందిన ముఖ్యమైన డేటా లీక్ అయింది. దీంతో కంపెనీ పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కూడా అటువంటి దాడుల నుంచి మిమ్మల్ని రక్షించదు.  అందుకే ఎప్పుడూ సేవ్ చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని చెబుతోంది.
 

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్