బంగారం విక్రయాలపై ఆర్బీఐ వివరణ

By Sandra Ashok KumarFirst Published Oct 28, 2019, 12:00 PM IST
Highlights

నగదు నిల్వలను పెంచుకోవడానికి ఆర్బీఐ తన వద్దనున్న పుత్తడి నిల్వలను భారీగా విక్రయించినట్లు పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేశాయి. దీంతో ఆర్బీఐ అప్రమత్తమైంది. తాము పుత్తడి విక్రయించిన మాట ఉత్తదేనని పేర్కొంటూ వివరణనిచ్చింది.

ముంబై: బంగారం అమ్మనున్నట్లు వచ్చిన భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఖండించింది. ఇప్పటి వరకు అలాంటి ఆలోచన ఏమీ లేదని, అవి కేవలం పుకార్టు మాత్రమేనని ఆర్బీఐ ఆదివారం స్పష్టంచేసింది. ఆర్ధిక మాంద్యం నేపథ్యంతోపాటు జీఎస్టీ వసూళ్లు తగ్గిపోవడంతోపాటు ఆదాయ కొరతను తీర్చడానికి ఆర్బీఐ ఆధీనంలోని బంగారం నిల్వలో కొంత బాగాన్ని విక్రయించనున్నట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. 

ఆర్బీఐ తన వద్ద బంగారం నిల్వల విక్రయించనున్నదని ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటిపై ఆర్బీఐ అప్రమత్తమైంది. పుత్తడి నిల్వల విక్రయం వార్తలు వదంతులేనని  ఆర్బీఐ వివరణ ఇచ్చింది. ఇప్పటికే ఆర్బీఐ తన వద్ద నిల్వ ఉన్న  రూ.1.76 లక్షల కోట్ల మిగులు నిల్వలను మోదీ ప్రభుత్వానికి ఇచ్చిన విషయం తెలిసిందే.

also read డాక్టర్ కావాలన్న కోరిక: బయోకాన్ ఇండియా అధినేత అయ్యారు

అప్పటి నుంచి ఆర్బీఐలో ఆర్థిక లోటు ఏర్పడిందని, దానిని పూడ్చుకోవడానికి బంగారం అమ్మనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాక గత 30 ఏళ్లలో ఇలా బంగారాన్ని విక్రయానికి పూనుకోవడం ఇదే తొలిసారి అని కూడా ట్రోల్ అవుతున్న వార్తల్లోని సారాంశం.

నివేదిక ప్రకారం ఈ ఆగస్టు నాటికి ఆర్‌బీఐ వద్ద 1.987 మిలియన్ ఔన్సుల బంగారం నిల్వ ఉంది. అక్టోబర్ 11 నాటికి ఫారెక్స్ రిజర్వులో 26.7 బిలియన్ డాలర్ల విలువైన బంగారం నిల్వ చేశారని నివేదిక స్పష్టం చేసింది.

also read గూగుల్‌లో ఉద్యోగుల అసమ్మతి

ఆర్బీఐ వద్ద 5.1 బిలియన్ డాలరల విలువైన బంగారంలో 1.15 బిలియన్ డాలర్ల బంగారం జూలై నుంచే విక్రయించడం ప్రారంభించినట్లు ఒక ఆంగ్ల దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది. ప్రస్తుతం ఈ నెల 11 నాటికి ఆర్బీఐ వద్ద ఫారెక్స్ నిలువల విలువ 26.7 బిలియన్ డాలర్లు ఉంటుంది. 

ఆగస్టు నెలాఖరు నాటికి 19.9 మిలియన్ల ఔన్సుల బంగారం ఉన్నట్లు సమాచారం. రిస్క్ ఫ్యాక్టర్స్‌ను పరిగణనలోకి తీసుకుని కేంద్రానికి నిల్వ నిధులు అందజేయాలని ఆర్బీఐ ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఫలితంగా గతేడాది డిసెంబర్ నెలలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు కూడా. 

click me!