మహీంద్రా ఫైనాన్స్ కంపెనీపై RBI సీరియస్ యాక్షన్...సారీ చెప్పిన ఆనంద్ మహీంద్రా..ఏం జరిగిందంటే..?

By Krishna AdithyaFirst Published Sep 23, 2022, 3:56 PM IST
Highlights

లోన్ రికవరీ కోసం థర్డ్-పార్టీ ఏజెంట్ల సేవలను ఉపయోగించకుండా మహీంద్రా ఫైనాన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధించింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో రికవరీ ఏజెంట్లు ట్రాక్టర్‌ను బలవంతంగా తీసుకెళ్లిన ఘటనలో గర్భిణి మృతి చెందింది. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ చర్య తీసుకున్నారు. 

లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ మేరకు మహేంద్ర ఫైనాన్స్ కంపెనీకి ఆర్బిఐ హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా నెల వాయిదాలు కట్టలేదని రికవరీ ఏజెంట్లతో పలు బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో రుణ వాయిదాలను వసూలు చేయిస్తుంటాయి. అయితే ఒక్కోసారి లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరిపోవడం పరిపాటిగా మారింది. 

తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ ప్రాంతంలో రైతు మితిలేష్ మెహతా వ్యవసాయ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అందుకు మహీంద్రా ఫైనాన్స్ వద్ద నుంచి రుణం పొందాడు. కాగా గత కొద్ది నెలలుగా ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవడంతో రుణ వాయిదాలను చెల్లించలేకపోయాడు. దీంతో గడువు తేదీ లోపల రుణ వాయిదాలను చెల్లించలేదని లోన్ రికవరీ ఏజెంట్లు మితిలేష్ మెహతా ట్రాక్టర్ ను జప్తు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బలవంతంగా మిదిలేష్ మెహతా వ్యవసాయ ట్రాక్టర్ ను లోన్ రికవరీ ఏజెంట్లు తీసుకొని పోతుండగా ప్రమాదవశాత్తు మితిలేష్ మెహతా కుమార్తె 27 ఏళ్ల గర్భిణీ ట్రాక్టర్ కింద పడి చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. 

సాధారణంగా ఫైనాన్స్ కంపెనీ థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా లోన్ రికవరీ పనులు చేపడుతుంటాయి  ఈ ఘటనలో మహేంద్ర ఫైనాన్స్ తరపున వచ్చిన థర్డ్ పార్టీ లోన్ రికవరీ దురుసు ప్రవర్తన వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో లోన్ రికవరీ ఏజెంట్ ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు లోన్ రికవరీ ఏజెంట్ టీం లీజు అనే సంస్థ ద్వారా రిక్రూట్ అయ్యాడు. మహేంద్ర ఫైనాన్స్ సంస్థ తమ లోన్ రికవరీ బాధ్యతను టీంలీజ్ సంస్థకు అప్పగించింది.

ఇందులో భాగంగానే టీంలీజ్ సర్వీస్ కంపెనీకి చెందినటువంటి లోన్ రికవరీ ఏజెంట్ రుణ వాసులు భాగంగా ట్రాక్టర్ ను జప్తుచేసాడు. ఇదిలా ఉంటే టీం లీజ్ సంస్థ సైతం ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతేకాక బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు.  ఇకపై తమ సంస్థ థర్డ్ పార్టీ ఏజెంట్లనుంచి రుణబకాయిల వసూలు చేపట్టదని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే మహేంద్ర ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వైస్ చైర్మన్ రమేష్ అయ్యర్ తమ సంస్థ ఇకపై థర్డ్ పార్టీ ఏజెంట్స్ ద్వారా రుణ బకాయిల వసూలు చేయదని ప్రకటించారు.

అంతేకాదు టీం లీజ్ సంస్థతో తమ ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నారు. అలాగే ఈ ఘటనపై విచారణ చేపడతామని తెలిపారు. కాగా ఈ విషాద ఘటనపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం సీరియస్ గా స్పందించింది మహేంద్ర ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ బయట వ్యక్తులను అంటే థర్డ్ పార్టీ సంస్థలను రుణ వసూలు చేపట్టకుండా నిషేధం విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 45L(1)(b) కింద తన అధికారాలను అమలు చేస్తూ, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MMFSL), వెంటనే రుణవసూళ్లు చేయడం నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఔట్‌సోర్సింగ్ ద్వారా రికవరీ లేదా రీపొసెషన్ కార్యకలాపాలను నిర్వహించకూడదని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. 

click me!