అక్టోబర్‌లో రైతులకు గుడ్ న్యూస్ వినిపిస్తున్న మోదీ ప్రభుత్వం, పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయంటే..

By Krishna AdithyaFirst Published Sep 23, 2022, 1:26 PM IST
Highlights

PM కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారా, అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.  లబ్ధిదారుల జాబితాలో మీ పేరు కూడా ఉంటే, ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఇప్పుడు నిరీక్షణ ఘడియలు ముగియబోతున్నాయి. అతి త్వరలో కిసాన్ యోజన 12వ విడత మీ ఖాతాలో వేయబడుతుంది.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు పీఎం కిసాన్ సామాన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా దేశంలోని కోట్లాదిమంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో సంవత్సరానికి 6000 రూపాయలు జమ చేస్తుంది. ప్రతి నాలుగు నెలలకు 2000 చొప్పున మొత్తం మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఈ నగదును రైతుల ఖాతాల్లో బదిలీ చేస్తుంది.

ఇప్పటివరకు మొత్తం 11 విడతల్లో రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్  యోజన డబ్బులను ట్రాన్స్ ఫర్ చేశారు. ఇక 12వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే 12వ విడత కిసాన్  యోజన డబ్బుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రస్తుతం ఒక శుభవార్త చెబుతున్నాము.

అయితే 12వ విడత డబ్బులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి త్వరలోనే నగదు బదిలీ చేయవచ్చనే సమాచారం అందుతోంది. 12వ విడత డబ్బుల కోసం నిరీక్షిస్తున్న ప్రజల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. మోదీ ప్రభుత్వం ఏడాదికి మూడుసార్లు రైతుల ఖాతాలో జమ చేయడం గమనార్హం. 

ఏటా మొదటి విడత ఏప్రిల్ నుంచి జూలై మధ్య రైతులకు అందజేస్తారు. అదే సమయంలో, రెండవ విడత ఆగస్టు, నవంబర్ మధ్య విడుదల చేస్తారు. కాగా మూడో విడత డిసెంబర్ నుంచి మార్చి మధ్య విడుదల చేస్తారు. అటువంటి పరిస్థితిలో, రైతులు అక్టోబర్‌లో 12వ తేదీన మూడో విడదల పీఎం కిసాన్ డబ్బులను కానుకగా పొందవచ్చు.

EKYCని అప్‌డేట్ చేయండి: 
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మొత్తం EKYC చేసిన రైతుల ఖాతాలో మాత్రమే జమ చేస్తారు. మీరు ప్రధానమంత్రి కిసాన్ నిధి  కింద ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు ఇప్పుడే దాన్ని పరిష్కరించవచ్చు. దీని కోసం, మీరు హెల్ప్‌లైన్ నంబర్ 155 261 లేదా 1800 11 5526కు కాల్ చేయవచ్చు . మీరు pmkisan-ict@gov.in ఇమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. 

రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పీఎం కిసాన్ యోజన పథకం కింద ఇప్పటికే 11వ విడతలో లబ్ధిదారుల సంఖ్య దాదాపు 11 కోట్లకు చేరింది అయితే తొమ్మిదో విడతలో ఈ సంఖ్య 11.9 కోట్లుగా ఉంది కాగా ఈ కేవైసీ చేయించుకొని రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు పడటం లేదు ఈ కేవైసీ నమోదు కడుపు ఆగస్టు 31న ముగిసింది

click me!