ఆర్‌బీఐ గవర్నర్‌కు కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్ లోనే విధులు..

Ashok Kumar   | Asianet News
Published : Oct 26, 2020, 01:37 PM IST
ఆర్‌బీఐ గవర్నర్‌కు కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్ లోనే విధులు..

సారాంశం

ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా వైరస్ బారినపడినట్లు ఆదివారం ట్వీట్ చేశారు, కరోనా లక్షణాలు లేనప్పటికీ కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. కరోనా సోకిన నేపథ్యంలో తనతో కొన్ని రోజులుగా సన్నిహితంగా  ఉన్న వారంతా పరీక్షలు చేయించుకోవాలని  సూచించారు.   

న్యూ ఢీల్లీ: ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా వైరస్ బారినపడినట్లు ఆదివారం ట్వీట్ చేశారు, కరోనా లక్షణాలు లేనప్పటికీ కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు.

కరోనా సోకిన నేపథ్యంలో తనతో కొన్ని రోజులుగా సన్నిహితంగా  ఉన్న వారంతా పరీక్షలు చేయించుకోవాలని  సూచించారు. 

also read మీరు ఎప్పుడు చూడని అరుదైన నీతా అంబానీ స్టైలిష్ లైఫ్ స్టయిల్ ఫోటోలు.. ...

ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, క్షేమంగానే ఉన్నానని, ఐసోలేషన్ లోనే విధులు నిర్వహిస్తూన్నానని చెప్పారు. నలుగురు డిప్యూటీ గవర్నర్లు బీపీ కనుంగో, ఎంకే జైన్, ఎండి పత్రా, ఎం రాజేశ్వర్ రావు నేతృత్వంలో ఉన్న ఆర్‌బీఐ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని శక్తికాంత దాస్ ట్వీట్ లో తెలిపారు.

 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం నాటి గణాంకాల ప్రకారం  78 లక్షలకు పైగా కేసులు నమోదవగా, మరణాల సంఖ్య 1.18 లక్షలకు చేరుకుంది.

భారతదేశంలో గత 24 గంటల వ్యవధిలో నమోదైన కోవిడ్-19  కేసులు వరుసగా మూడవ రోజు 55వేల కన్నా తక్కువగానే ఉండగా, ఒక రోజులో నమోదైన కొత్త మరణాలు దాదాపు మూడు నెలల తర్వాత 578 కి పడిపోయాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !