ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ డీల్‌కు బ్రేక్.. ఒప్పందాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ..

By Sandra Ashok KumarFirst Published Oct 26, 2020, 11:22 AM IST
Highlights

 రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ కంపెనీ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) తాజాగా కిషోర్‌ బియానీ ప్రమోటింగ్ కంపెనీ ఫ్యూచర్‌ గ్రూప్‌ కొనుగోలు డీల్‌కు బ్రేక్ పడింది. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ దాఖలు చేసుకున్నఅభ్యర్థనపై సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐఏసీ) సానుకూలంగా స్పందించింది. 

బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ కంపెనీ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) తాజాగా కిషోర్‌ బియానీ ప్రమోటింగ్ కంపెనీ ఫ్యూచర్‌ గ్రూప్‌ కొనుగోలు డీల్‌కు బ్రేక్ పడింది.

ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ దాఖలు చేసుకున్నఅభ్యర్థనపై సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐఏసీ) సానుకూలంగా స్పందించింది. ఈ  ఒప్పందాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆర్‌ఆర్‌వీఎల్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్‌ విభాగాల కొనుగోలుకు 24,713 కోట్లు రూపాయల ఒప్పందం చేసుకుంది.

అయితే ఫ్యూచర్‌ గ్రూప్‌ తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఈ డీల్‌ విరుద్ధమైనదంటూ అమెజాన్ వ్యతిరేకించింది. దీనికి సంబంధించి ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌కు లీగల్ నోటీసులు పంపించింది. దీనిపై సింగపూర్ కేంద్రంగా ఉన్న సింగిల్-జడ్జ్ ఆర్బిట్రేషన్ ప్యానెల్  సానుకూలంగా స్పందించింది. 

also read 

గతేడాది ఆగస్టులో ఫ్యూచర్స్‌ కూపన్స్‌లో 49 శాతం వాటాలను ప్రమోటర్ల నుంచి కొనుగోలు చేసింది అమెజాన్ అప్పట్లో ఫ్యూచర్‌ రిటైల్‌ సంస్థలో ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం వాటాలు ఉండేది.

ఒప్పంద నిబంధనల ప్రకారం మూడేళ్ల తర్వాత నుంచి పదేళ్ల లోపున ప్రమోటర్‌కు చెందిన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్‌కు అధికారం ఉంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందాన్ని నిలిపివేయాలని కోరుతూ అమోజాన్ కోర్టును ఆశ్రయించింది.

మరోవైపు ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించు కోవాలని ఫ్యూచర్‌ గ్రూప్‌ భావిస్తున్నట్లు సమాచారం. 

click me!