క్రిప్టోకరెన్సీ, ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై చర్చలు కొనసాగుతున్నాయి: ఆర్‌బిఐ గవర్నర్

By S Ashok KumarFirst Published Mar 26, 2021, 4:07 PM IST
Highlights

ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై మేము ప్రభుత్వంతో చర్చిస్తున్నామని, ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై మేము ప్రభుత్వంతో చర్చిస్తున్నామని, ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఆర్‌బి‌ఐ అన్ని విధాన చర్యలను ఉపయోగించుకోవడానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు.

వృద్ధి అంచనాలను తగ్గించాల్సిన అవసరం లేదు 
 ఫిబ్రవరి 1న 2021-22 బడ్జెట్‌ను సమర్పించిన  ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక సాధారణ ఇన్షూరెన్స్ కంపెనీని ప్రైవేటీకరించాలని ప్రతిపాదించడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బిఐ 10.5 శాతం వృద్ధి అంచనాలపై ఆర్థిక పునరుజ్జీవనం నిరంతరాయంగా కొనసాగాలని ఒక ప్రశ్నకు సమాధానంగా శక్తికాంత దాస్ అన్నారు.

also read వారికి అద్భుత అవకాశాలు: రిలయన్స్ అధిపతి ముకేష్ అంబానీ ...

24 గంటలు అందుబాటులో ఉన్న ఆర్‌టి‌జి‌ఎస్ అండ్ ఎన్‌ఈ‌ఎఫ్‌టి సౌకర్యం
మెరుగైన సేవలను అందించడానికి ఆర్థిక రంగంలో ఆవిష్కరణల అవసరాన్ని నొక్కిచెప్పడంతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహించే సమర్థవంతమైన నియంత్రణకు  శక్తికాంత దాస్ పిలుపునిచ్చారు. ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఇప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.

ఆర్‌టి‌జి‌ఎస్ కి వివిధ కరెన్సీలలో లావాదేవీలు చేసే సామర్థ్యం ఉంది.  ప్రజలకు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ప్రయోజనాలను అందించడానికి 274 కోట్ల డిజిటల్ లావాదేవీలు సులభతరం చేయబడ్డాయి. వాటిలో ఎక్కువ భాగం కరోనా వ్యాప్తి సమయంలో జరిగాయి.

క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వమే నిర్ణయిస్తుంది
క్రిప్టోకరెన్సీకి సంబంధించి కేంద్ర బ్యాంక్  అంచనా వేస్తోందని అన్నారు. క్రిప్టోకరెన్సీ గురించి మా ఆందోళనలను మేము ప్రభుత్వానికి తెలియజేసాము, దీనిని పరిగణించనుంది. అలాగే త్వరలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19  కేసులు ఆందోళన కలిగించే విషయమని, అయితే ఈసారి దీనిని పరిష్కరించడానికి మాకు అదనపు చర్యలు ఉన్నాయని ఆయన అన్నారు. గతేడాది లాగా లాక్‌డౌన్ అయ్యే అవకాశం లేదు అని తెలిపారు.
 

click me!