టాటా గ్రూపు-సైరస్ మిస్త్రీ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు.. టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌కి భారీ షాక్..

By S Ashok KumarFirst Published Mar 26, 2021, 3:22 PM IST
Highlights

టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ సైరస్ మిస్త్రీ విషయంలో చీఫ్ జస్టిస్ ఎస్ఐ బొబ్డే, జస్టిస్ ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణ్యం ధర్మాసనం సైరస్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుండి తొలగించడం సరైనదేనని భావించింది.  
 

  టాటా గ్రూపు-    సైరస్ మిస్త్రీ  కేసులో సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పును ప్రకటించింది. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ సైరస్ మిస్త్రీ విషయంలో చీఫ్ జస్టిస్ ఎస్ఐ బొబ్డే, జస్టిస్ ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణ్యం ధర్మాసనం సైరస్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుండి తొలగించడం సరైనదేనని భావించింది.  

ఈ కేసులో కోర్టు తన నిర్ణయాన్ని గత ఏడాది డిసెంబర్ 17న రిజర్వు చేసింది. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి) సైరస్ మిస్త్రీని 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన గ్రూప్  ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి తిరిగి నియమించాలని ఆదేశించింది. ఎన్‌సిఎల్‌టి నిర్ణయానికి వ్యతిరేకంగా టాటా సన్స్ 2020 జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

also read 

విషయం ఏమిటి?
టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుండి సైరస్ మిస్త్రీని తొలగించడం అక్టోబర్ 2016లో జరిగిన బోర్డు సమావేశంలో ఆకస్మిక చర్య అని షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పి) బృందం డిసెంబర్ 17న కోర్టుకు తెలిపింది. ఇది కంపెనీ కార్యకలాపాల సూత్రాలకు విరుద్ధం అని తెలిపారు.

మరోవైపు టాటా గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించింది, ఇందులో ఎలాంటి తప్పిదం లేదని సైరస్ మిస్త్రీని పదవి నుండి తొలగించడానికి బోర్డు  అధికారం ఉంది అని వెల్లడించింది.

2012 లో సైరస్ మిస్త్రీ స్థానంలో రతన్ టాటా 
2012లో రతన్ టాటాను టాటా సన్స్ ఛైర్మన్‌గా నియమించారు. కానీ నాలుగు సంవత్సరాల తరువాత అంటే 24 అక్టోబర్ 2016 న ఆయనను తొలగించారు. 2017 లో ఎన్ చంద్రశేఖరన్ చైర్మన్ అయ్యారు. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాన్ని సవాలు చేస్తూ సైరస్ మిస్త్రీ అప్పీల్ (క్రాస్ అప్పీల్) పై టాటా సన్స్, ఇతరులకు కోర్టు నోటీసు జారీ చేసింది.

సైరస్ మిస్త్రీ విజ్ఞప్తి ప్రకారం, అతను సంస్థలో తన కుటుంబానికి  సమానమైన వాటాను కోరుకుంటున్నారు. అతని కుటుంబానికి టాటా గ్రూపులో 18.37 శాతం వాటా ఉంది. టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌లకు 66 శాతం, సైరస్ మిస్త్రీ కుటుంబానికి  18.4 శాతం వాటా ఉంది.

click me!