వారికి అద్భుత అవకాశాలు: రిలయన్స్ అధిపతి ముకేష్ అంబానీ

By S Ashok KumarFirst Published Mar 26, 2021, 2:42 PM IST
Highlights

ఈ సంవత్సరం ఈ‌వై 2020 అవార్డులు గెలిచిన పారిశ్రామికవేత్తలకు నా హృదయపూర్వక అభినందనలు. నాకు నేడు, రేపటి భారతదేశాన్ని చూస్తుంటే వ్యవస్థాపకులకు అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత సంవత్సరం 2020 కోసం నిర్వహించిన అవార్డుల సందర్భంగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ప్రసంగించారు. అంబానీ మాట్లాడుతూ 

"లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ ఈవినింగ్ ! ఈ సంవత్సరం ఈ‌వై 2020 అవార్డులు గెలిచిన పారిశ్రామికవేత్తలకు నా హృదయపూర్వక అభినందనలు. నాకు నేడు, రేపటి భారతదేశాన్ని చూస్తుంటే వ్యవస్థాపకులకు అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
అయితే నా నమ్మకానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదట, మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ  భారతదేశ అభివృద్ధి భవిష్యత్తులో ప్రైవేటు రంగం ఎక్కువ పాత్ర పోషించాలని సూచించారు. దీన్ని మనమందరం స్వాగతించాలి.

రెండవది, మనకు ఇప్పుడు  మన ఎకానమీని కొత్త విప్లవాత్మక శక్తిగా  మార్చడానికి టెక్నాలజి  ఉంది. మంచి నాణ్యమైన జీవనం కోసం 1.3 బిలియన్ ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తీర్చడానికి ఒక చిన్న, మధ్య లేదా పెద్ద వ్యాపారాలకు  జీవితకాలంలో  ఒకేసారి అవకాశం వస్తుంది. ప్రపంచంలోని మూడు ఆర్థిక వ్యవస్థలలో  అగ్రస్థానంలో ఉండటానికి రాబోయే దశాబ్దాలలో మనకు అవకాశం ఉంది.

క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, వంటి కొత్త రంగాలు లైఫ్సైన్సెస్ & బయోటెక్నాలజీ, ఇప్పటికే ఉన్న  వ్యవసాయ, పారిశ్రామిక , సేవా రంగాలు అపూర్వమైనవి
అవకాశాలను అందిస్తున్నాయి.

అంతేకాకుండా భారతీయ పారిశ్రామికవేత్తలు మార్కెట్ అవసరాలను తీర్చడానికి ప్రపంచాన్ని ఓడించే నాణ్యమైవి  ఇప్పుడు అందించగల సామర్థ్యం కలిగి ఉన్నారు
  
 భారతీయ పారిశ్రామికవేత్తలకు రెండు అవకాశాలు ఉన్నాయి, మొదట దేశీయ మార్కెట్లకు, తరువాత ప్రపంచ మార్కెట్లకు సేవలు అందించడం. నేడు, మన దేశం ప్రపంచ వృద్ధికి కేంద్రంగా ఉండబోతోంది.

భారతదేశం ఎదుగుదల ఇప్పటికే ప్రారంభమైంది. ఆర్థిక శక్తిగా, ప్రజాస్వామ్య శక్తిగా, దౌత్య మరియు వ్యూహాత్మక శక్తిగా సాంస్కృతిక శక్తిగా, డిజిటల్ అండ్ టెక్నాలజీ శక్తిగా ముందుకు సాగుతోంది.

నా ప్రియమైన పారిశ్రామికవేత్తలార మీలో చాలా మంది కొత్త వ్యాపారాలను  ప్రారంభించారు. అందువల్ల, నేను మీతో ఒక వ్యక్తిగతంగా నేర్చుకున్నది పంచుకోవాలనుకుంటున్నాను. స్టార్ట్-అప్ వ్యవస్థాపకులు తక్కువ వనరులతో ఆన్ లిమిటెడ్ డిటర్మినేషన్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.

నా యువ మిత్రులారా, నా మెసేజ్ ఫెల్యూర్ తో ఆగిపోవద్దు ఎందుకంటే చాలా వైఫల్యాల తరువాత మాత్రమే విజయం ఉంటుంది. నేను ఖచ్చితంగా ఉన్నాను. ఒక వ్యవస్థాపకుడు  రాణించాలంటే ధైర్యం, సంకల్పం ఉంటుంది.  అందువల్ల నాకు పూర్తిగా నమ్మకం ఉంది.

నా తరం వ్యవస్థాపకుల కంటే  మీరు భారతదేశానికి చాలా పెద్ద విజయ కథలను అందించబోతున్నారు.  మీరు మీ కలలను కొనసాగించడానికి మీకు ఆల్ ది బెస్ట్. మీకు ఆ దేవుని దీవెనలు ఎప్పుడు ఉండాలి! సురక్షితంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ధన్యవాదాలు. అని అంటూ ప్రసంగాన్ని ముగించారు .

click me!