HDFC-HDFC Bank merger: దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుగా మారేందుకు HDFC- HDFC Bank విలీనానికి మార్గం సుగమం

By Krishna AdithyaFirst Published Jul 5, 2022, 11:45 AM IST
Highlights

HDFC-HDFC Bank merger: HDFC Bank, HDFC సంస్థల విలీనానికి స్టాక్ ఎక్స్ చేంజీలతో పాటు, RBI నుంచి గ్రీన్ సిగ్నల్ అందింది. దీంతో HDFC BANK దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుగా అవతరించనుంది. విలీనానికి గ్రీన్ సిగ్నల్ అందడంతో రెండు సంస్థల షేర్లలో ర్యాలీ నడుస్తోంది. 

RBI approves HDFC-HDFC Bank merger: ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, దాని బ్యాంకింగ్ అనుబంధ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనానికి మార్గం సులభం అయ్యింది. దేశ కార్పొరేట్ ప్రపంచ చరిత్రలో ఈ అతిపెద్ద డీల్ (HDFC-HDFC Bank Merger) కి ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓకే చెప్పగా. రెండు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలు BSE, NSE లు ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి. 

ఇంకా ఈ అనుమతులు అవసరం
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సోమవారం అర్థరాత్రి బిఎస్‌ఇకి ఈ మేరకు సమాచారాన్ని అందించింది. బ్యాంక్ బిఎస్‌ఇకి అందించిన సమాచారంలో ఇలా ఉంది. ' హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి రిజర్వ్ బ్యాంక్ నుండి జూలై 4న   లేఖ అందినట్లు సమాచారం అందించింది. లేఖ ప్రకారం, ఒప్పందం పథకానికి ఆర్‌బిఐ ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. అయితే లేఖలో పేర్కొన్న కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. అంతేకాకుండా, ప్రస్తుతం ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఇతర సంబంధిత అధికారుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ తెలిపింది. ఇది కాకుండా, పథకంలో పాల్గొన్న కంపెనీల వాటాదారులు, రుణదాతల ఆమోదం కూడా అవసరం ఉంది.

అంతకుముందు, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC Bank దేశంలోని అతిపెద్ద లోన్ ప్రొవైడర్ కంపెనీ HDFC లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి ఏప్రిల్ 4న అంగీకరించింది. ఈ డీల్ విలువ దాదాపు 40 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ కోణంలో, భారతీయ కార్పొరేట్ ప్రపంచానికి ఇదే అతిపెద్ద డీల్ అవుతుంది. ఈ డీల్ అమల్లోకి వచ్చిన తర్వాత HDFC Bank ఆర్థిక సేవా రంగంలో అతి పెద్ద కంపెనీగా రూపు దాల్చనుంది. విలీనం తర్వాత ఉద్భవించే కంబైన్డ్ కంపెనీ దాదాపు రూ.18 లక్షల కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండవ లేదా మూడవ త్రైమాసికం నాటికి ఈ ఒప్పందం పూర్తవుతుందని భావిస్తున్నారు.

ఈ డీల్ పూర్తయిన తర్వాత, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో 100 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సికి చెందిన ప్రస్తుత వాటాదారులు బ్యాంకులో 41 శాతం వాటాను కలిగి ఉంటారు. హెచ్‌డిఎఫ్‌సిలోని ప్రతి షేర్‌హోల్డర్‌కు 25 షేర్లకు గాను 42 HDFC Bank షేర్లు లభిస్తాయి. డిసెంబర్ 2021 బ్యాలెన్స్ షీట్‌ను పరిశీలిస్తే, రెండు సంస్థల ఆస్తులు కలిపి రూ. 17.87 లక్షల కోట్లు అవుతుంది. 1 ఏప్రిల్ 2022 నాటికి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 8.36 లక్షల కోట్లు, హెచ్‌డిఎఫ్‌సిది రూ. 4.46 లక్షల కోట్లుగా తేలింది. దేశీయ బ్యాంకింగ్ రంగంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ICICI బ్యాంక్‌తో పోలిస్తే విలీనం తర్వాత ఉద్భవించే HDFC Bank పరిమాణం రెట్టింపు కానుంది.

click me!