
నేడు జూలై 2న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200గా ఉంది, నిన్నటితో పోలిస్తే రూ.1,310 భారీగా పెరిగింది. మరోవైపు నిన్నటితో పోలిస్తే కిలో వెండి రూ.400 పెరగడంతో రూ.59,000కి కొనుగోలు చేస్తున్నారు.
రాష్ట్ర పన్నులు, ఎక్సైజ్ సుంకం, మేకింగ్ ఛార్జీలతో సహా పలు అంశాల కారణంగా బంగారం ధర అస్థిరంగా ఉంది. ఈ రోజు దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
ఒక వెబ్‌సైట్ ప్రకారం న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే కోల్‌కతా, ముంబై, చెన్నై, న్యూఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.52,200 వద్ద ఉంది.
హైదరాబాద్‌లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.47,850గా ఉండగా, విశాఖపట్నంలో దీని ధర 47,850 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేరళ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో రూ. 52,200 ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు 1,794 డాలర్లు, వెండి ధర ఔన్సుకు 19.76 డాలర్లుగా ఉంది. అయితే ప్రపంచ ఆర్ధిక పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరలు వంటి ఇతర అంశాలు కూడా పసిడి ధరలను పరుగులు పెట్టించనున్నాయి. ఒకవేల ఇదే జరిగితే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు రానున్న పండుగ సీజన్, అక్షయతృతీయ లేదా పెళ్లిళ్లు, శుభకార్యాలు కారణంగా అమ్మకాలపై బంగారం దుకాణపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
క్రితంతో పోలిస్తే కరోనా మమ్మరి వ్యాప్తి కాలంలో బంగారం ధర అల్ టైమ్ హైకి చేరింది. దీంతో పసిడి తులం ధర రూ.56,000కి చేరింది. తరువాత బంగారం ధర 50వేల లోపు దిగోచ్చిన మళ్ళీ పుంజుకొని 52వేల స్థాయిలో కొనసాగుతుంది.
అలాగే ఈ వారం బంగారం, వెండి ధరలు కాస్త బలహీనంగా ఉన్నాయి. కానీ వారం చివరిలో దిగిమతి సుంకం పెంచడంతో ఒక్కసారి పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిచ్చాయి. ఒక నివేదిక ప్రకారం భవిష్యత్తులో బంగారం ధరలను పరిశీలిస్తే 60వేలు దాటి 70 వేలకు పరుగులు తీసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.