కాఫీ ఆర్డర్లు తీసుకుంటూ కనిపించిన ట్విట్టర్ సీఈవో.. అసలు ఏం జరిగిందంటే..?

By asianet news teluguFirst Published Jul 4, 2022, 11:01 AM IST
Highlights

పరాగ్ అగర్వాల్ యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటన సందర్భంగా జరిగిన ఈవెంట్‌లలో స్టాండ్-అప్ కామెడీ షో కూడా ఉంది. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే నవంబర్ 2021లో సంస్థను విడిచిపెట్టిన తర్వాత పరాగ్ అగర్వాల్ కంపెనీ బాధ్యతలు స్వీకరించారు.

ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ గత వారం లండన్‌లో జరిగిన  బిజినెస్ కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే ఆ సమయంలో పరాగ్ అగర్వాల్ సిబ్బందికి కాఫీ అందించి అందరినీ ఆశ్చర్యపరుస్తూ  సమయం కూడా కేటాయించారు.
విషయం ఏంటంటే సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లండన్ కార్యాలయంలో పరాగ్ అగర్వాల్ కాఫీ ఆర్డర్లు తీసుకుంటూ కనిపించారు. అంతేకాదు అతనితో పాటు యూకేలోని ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్ దారా నాసర్ కూడా పరాగ్ అగర్వాల్ తో ఉన్నారు. ట్విట్టర్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ కాఫీతో కొన్ని కుకీలను(biscuits)కూడా అందించాడు.

పరాగ్ అగర్వాల్ యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటన సందర్భంగా జరిగిన ఈవెంట్‌లలో స్టాండ్-అప్ కామెడీ షో కూడా ఉంది. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే నవంబర్ 2021లో సంస్థను విడిచిపెట్టిన తర్వాత పరాగ్ అగర్వాల్ కంపెనీ బాధ్యతలు స్వీకరించారు.

మే 2022లో  సెలవులో ఉన్నప్పుడు పరాగ్ అగర్వాల్ ఇద్దరు ఉద్యోగులను తొలగించారు.  వీరిలో కన్జ్యూమర్ ప్రాడెక్ట్స్  హెడ్ కైవాన్ బేక్‌పూర్,  రెవెన్యూ హెడ్ బ్రూస్ ఫాల్క్   ఉన్నారు. 

టెస్లా అండ్ స్పేస్‌ఎక్స్ CEO ఎలోన్ మస్క్ కొన్ని వారాల క్రితం ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ట్విట్టర్ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఎలోన్ మస్క్ సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్ ని $44 బిలియన్లకు కొనుగోలు చేయాల్సి ఉంది. ఎలోన్ మస్క్ ప్రకారం, చైనాలోని వీచాట్ లాగానే ట్విట్టర్ సూపర్ యాప్‌గా అభివృద్ధి చెందాలని అతను కోరుకుంటున్నాడు.

“గత కొన్ని వారాలుగా చాలా జరిగాయి. నేను కంపెనీపై దృష్టి కేంద్రీకరించాను, ఈ సమయంలో నేను బహిరంగంగా చెప్పలేను, కానీ నేను ఇప్పుడు చేస్తాను" అని అగర్వాల్ ఒక ట్వీట్‌లో తెలిపారు, "మేము నిన్న మా హెడ్ టీం అండ్ కార్యకలాపాలలో మార్పులను ప్రకటించాము. ప్రజలను ప్రభావితం చేసే మార్పులు ఎప్పుడూ కష్టమే. CEO ఈ మార్పులు ఎందుకు చేస్తారని కొందరు అడుగుతున్నారు. చిన్న సమాధానం చాలా సులభం." అని అన్నారు.

click me!