ఎలక్షన్ డ్యూటీ సిబ్బందికి రెమ్యూనరేషన్​ ఎంతో ఇస్తారో తెలుసా...

By Ashok kumar Sandra  |  First Published May 13, 2024, 11:46 AM IST

గతంలో పోలింగ్‌ అధికారులు, రూట్‌ అధికారులు, వైద్య బృందం, శిక్షణ సహాయకులు, బ్యాలెట్‌ ఇన్‌స్టాలర్లకు రూ.500తో పాటు ఫుడ్  ఖర్చుల కోసం రూ.250 కేటాయించారు. సవరించిన రేట్లు ఇప్పుడు రోజువారీ వేతనం కోసం రూ. 250, భోజనానికి రూ. 250, మొత్తం ప్రయాణ ఖర్చులకు రూ. 250, డిఎగా రూ. 500, మొత్తంగా వారి రెండు రోజుల సర్వీస్‌కు రూ. 2250 లభిస్తాయి.


లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వారి సేవలకు పరిహారం కింద రెమ్యునరేషన్ రేట్లను తాజాగా  సవరించారు. గతంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, రిహార్సల్ ట్రైనర్‌లు, పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూటర్లు/రిసీవర్లు ఇంకా  మైక్రో అబ్జర్వర్‌లకు రోజుకు రూ. 600తో పాటు ఫుడ్ ఖర్చుల కోసం  రూ. 250 ఇవ్వాలని నిర్ణయించింది. సవరించిన రేట్లు ఇప్పుడు ఈ క్రింది విధంగా ఉన్నాయి: రోజు వేతనంగా రూ. 350, భోజనానికి రూ. 250, మొత్తం ప్రయాణ ఖర్చులకు రూ. 250, అర్హతగల వారికీ డీఏగా రూ.600.  

అయితే, రిహార్సల్ ట్రైనర్లు, పోలింగ్ మెటీరియల్స్ (రిసెప్షన్ అసిస్టెంట్లు), మైక్రో అబ్జర్వర్‌లకు ప్రయాణ ఖర్చులు ఉండవు, అయితే  అదనంగా, ప్రిసైడింగ్ అధికారులు ఫోన్ వినియోగ ఖర్చులకు రూ.50 అందుకుంటారు. .

Latest Videos

undefined

గతంలో పోలింగ్‌ అధికారులు, రూట్‌ అధికారులు, వైద్య బృందం, శిక్షణ సహాయకులు, బ్యాలెట్‌ ఇన్‌స్టాలర్లకు రూ.500తో పాటు ఫుడ్  ఖర్చుల కోసం రూ.250 కేటాయించారు. సవరించిన రేట్లు ఇప్పుడు రోజువారీ వేతనం కోసం రూ. 250, భోజనానికి రూ. 250, మొత్తం ప్రయాణ ఖర్చులకు రూ. 250, డిఎగా రూ. 500, మొత్తంగా వారి రెండు రోజుల సర్వీస్‌కు రూ. 2250 లభిస్తాయి. అయితే, రూట్ ఆఫీసర్లు, మెడికల్ టీమ్, ట్రైనింగ్ అసిస్టెంట్లు, బ్యాలెట్ ఇన్‌స్టాలర్‌లకు ప్రయాణ ఖర్చులు అందించబడదు, కాబట్టి వారి మొత్తం పరిహారం రూ. 250 తగ్గుతుంది, అంటే వారికి రూ. 2000 అందుతుంది.

గ్రూప్ డి ఉద్యోగులు గతంలో రోజువారీ వేతనంగా రూ.400, భోజనానికి రూ.250 పొందేవారు. రోజువారీ వేతనం రూ.200, భోజనానికి రూ.250, మొత్తం ప్రయాణ ఖర్చులకు రూ.250, డీఏగా రూ.350 చొప్పున సర్దుబాట్లు చేయడంతో ఏప్రిల్ 25, 26 తేదీల్లో విధులకు సంబంధించి మొత్తం రూ.1850 పరిహారం అందజేసారు.


ఈసీ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం  

సెక్టార్​ ఆఫీసర్: రూ. 5 వేలు

మాస్టర్​ ట్రైనర్: రూ. 2 వేలు

ప్రిసైడింగ్​ ఆఫీసర్​, కౌంటింగ్​ సూపర్​వైజర్​, రిసెప్షన్​ సూపర్​ వైజర్:  రూ. 350 రోజుకు

పోలింగ్ ఆఫీసర్‌, కౌంటింగ్ అసిస్టెంట్‌, రిసెప్షన్ అసిస్టెంట్‌:రూ. 250 రోజుకు

క్లాస్‌ IV, ఎంటీఎస్‌: రోజుకు రూ. 200

ప్యాక్డ్ లంచ్‌ లేదా లైట్‌ రిఫ్రెష్‌మెంట్‌: రోజుకు రూ.150  

వీడియో సర్వే టీం, వీడియో వ్యూయింగ్ టీం, అకౌంటింగ్ టీం, ఎక్సెపెండేచర్‌ మానిటరింగ్ కంట్రోల్‌ రూమ్‌ అండ్‌ కాల్ సెంటర్‌ స్టాఫ్‌, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్‌ కమిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌, స్టాటస్టిక్‌ సర్వేలైన్స్‌ టీం, ఎక్స్‌పెండేచర్‌ మానిటరింగ్ సెల్‌, క్లాస్‌ -I /II కి రూ.1200, క్లాస్‌ -III కి రూ.1000 , క్లాస్‌ -IV  రోజుకు రూ.200

మైక్రో అబ్జర్వర్స్‌:  రూ:1000

అసిస్టెంట్‌ ఎక్స్‌పెండేచర్‌ అబర్వర్‌: రూ.7500 

పోలింగ్‌ రోజున విధులకు నియమితులయ్యే పోలీసు సిబ్బందికి, మొబైల్‌ పార్టీ సిబ్బందికి, హోం గార్డులకు, ఫారెస్టు గార్డులకు, గ్రామ రక్షక దళం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లకు ప్యాక్ట్‌ లంచ్‌ లేదా రూ.150 నగదు చెల్లిస్తారు. ఎన్నికల్లో పోలింగ్‌ విధులకు, ఓట్ల లెక్కంపు విధులకు నియమితులైన వారికి రెమ్యునరేషన్‌తో పాటు లంచ్‌కు రూ.150 చెల్లిస్తారు. అర్హత మేరకు డీఏ చెల్లిస్తారు.

click me!