‘నాకు ఏదైనా జరిగితే.... ’ కరోనా వ్యాక్సిన్ కంపెనీపై ఉద్యోగి షాకింగ్ కామెంట్స్..!

By ramya Sridhar  |  First Published May 11, 2024, 10:42 AM IST

మెలిస్సా మెక్ టీ అనే మహిళ ఫైజర్ లో దాదాపు పది సంవత్సరాలుగా పనిచేస్తోంది. అయితే.. అక్కడ జరుగుతున్న దారుణాలను ఆమె  సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది.


కరోనా సమయంలో ప్రజలు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అలా జనాలు కుప్పలు తెప్పలుగా చనిపోతుండటంతో..  వారి ప్రాణాలు కాపాడేందుకు చాలా రకాల ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చాయి. అలా  వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన ఫార్మా కంపెనీలో ఫైజర్ కూడా ఒకటి.  అమెరికాకు చెందిన  కంపెనీ ఈ ఫైజర్ వ్యాక్సిన్ ని తయారు చేసింది. ప్రపంచంలో దాదాపు 150కి పైగా దేశాల్లో ఈ వ్యాక్సిన్ ని పంపిణీ చేశారు. ఆ మధ్య.. ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో .. చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే వార్తలు కూడా వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే... ప్రస్తుతం ఈ ఫైజర్ కంపెనీపై అందులో పనిచేసే ఓమహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది.

మెలిస్సా మెక్ టీ అనే మహిళ ఫైజర్ లో దాదాపు పది సంవత్సరాలుగా పనిచేస్తోంది. అయితే.. అక్కడ జరుగుతున్న దారుణాలను ఆమె  సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది.  2021లోనే ఆమె.. ఈ కంపెనీపై ఆరోపణలు చేసింది.  ఈ కంపెనీ  MRNA వ్యాక్సిన్ ల్యాబ్ టెస్టింగ్‌లో మానవ పిండం కణజాల నుంచి సెల్స్ వాడిందని.. దానికి సంబంధించిన మెయిల్స్ ని ఆమె లీక్ చేశారు.

Latest Videos

అయితే... ఇప్పుడు తాజాగా అదే విషయం గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో కూడా విడుదల చేయడం గమనార్హం. మెలిస్సా ఫైజర్ లో  విజిల్ బ్లోయర్ గా పని చేశారు. అయితే... కొద్దిరోజుల క్రితం 737 మ్యాక్స్ బోయింగ్ విమానంలో లోపాలను ఆ కంపెనీలో పనిచేసే విజిల్ బ్లోయర్ బయటపెట్టాడు. అలా బయటపెట్టిన కొద్దిరోజులకే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో మ్యాక్స్ కూడా తన ప్రాణాలకు హాని ఉంది అంటూ ట్విట్టర్ లో వీడియో షేర్ చేయడం గమనార్హం.

తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన లేదని,  తనకు తన భర్త, కుమారుడు అంటే చాలా ఇష్టం అని, కనీసం తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు కూడా లేవు అని  చెప్పింది. కాబట్టి.. తనకు ఏదైనా  జరిగితే...అదంతా ఆ ఫార్మా కంపెనీదే తప్పు అంటూ ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే... ఆమె వీడియోకి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు మెలిస్సాకు మద్దతుగా మాట్లాడుతుంటే.. కొందరు ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని అందుకే అలా మాట్లాడుతోందని.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అయితే.. గతంలోనే మెలిస్సా చేసిన ఆరోపణలను  ఫైజర్ సీనియర్ డైరెక్టర్ వెనెస్సా గెల్ మాన్ కొట్టిపారేయడం గమనార్హం. 


 

click me!