10 సంవత్సరాల వయస్సులోనే తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయాను : రతన్ టాటా

By Sandra Ashok KumarFirst Published Nov 3, 2020, 1:16 PM IST
Highlights

రతన్ టాటా భారతదేశం నుండి విజయవంతమైన వ్యాపారవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రపంచంలోని అతిచిన్న కారు టాటా నానోను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. అయినప్పటికీ కుటుంబ విషయంలో అతనికి అంతగా సంతోషకరమైన సంఘటనలు లేవు. 

ప్రముఖ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరు వింటేనే చాలు, అతనికి ఎలాంటి గుర్తింపు అవసరం లేదు. రతన్ టాటా భారతదేశం నుండి విజయవంతమైన వ్యాపారవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రపంచంలోని అతిచిన్న కారు టాటా నానోను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు.

అయినప్పటికీ కుటుంబ విషయంలో అతనికి అంతగా సంతోషకరమైన సంఘటనలు లేవు. నిజానికి తన పదేళ్ళ వయసులో అతని తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత అతన్ని వారి నానమ్మ పెంచింది.

కేవలం 21 సంవత్సరాల వయసులో టాటా గ్రూపు చైర్మన్ అయిన రతన్ టాటా ప్రేమలో కూడా పడ్డాడు కాని అందులో కూడా విజయం సాధించలేకపోయాడు.

సాధారణంగా తన వ్యక్తిగత జీవితం గురించి నిశ్శబ్దంగా ఉండే టాటా, తాను ఎలా ప్రేమలో పడ్డాను, వివాహం గురించి కూడా  చెప్పాడు. ఈ సంఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగింది.

also read 

రతన్ టాటా కాలేజీ పూర్తి చేసిన తరువాత ఆర్కిటెక్చర్ సంస్థలో పనిచేయడం ప్రారంభించాడు. 1960 ప్రారంభంలోనే టాటాకు సొంత కారు కూడా ఉంది.

83 సంవత్సరాల వయస్సులో ఉన్న రతన్ టాటా లాస్ ఏంజిల్స్ లో ఉన్నప్పుడు జరిగిన తన ప్రేమ విషయమని చెప్పారు. నేను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్న సమయంలో మా నానమ్మ తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసింది, ఆ సమయంలో నేను లాస్ ఏంజిల్స్ లో ఉన్నాను.

నేను వెంటనే భారతదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.  నా కాబోయే భార్య కూడా నాతో భారతదేశానికి వస్తుందని నేను ఆశించాను, భారతదేశానికి వచ్చిన తరువాత నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాను.

కానీ 1962లో ఇండో-చైనా వివాదం కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు ఆమెని భారతదేశానికి పంపించడానికి నిరాకరించారు, తరువాత మా సంబంధం విడిపోయింది. 

రతన్ టాటా నానమ్మ నవాజ్‌బాయి టాటాతో చాలా సన్నిహితంగా ఉండేవాడినని, ఈ రోజు కూడా నానమ్మ బోధించిన విషయాలతో ముందుకు సాగుతున్నానని చెప్పారు. రత్న టాటా మాట్లాడుతూ, 'డాడీ గౌరవాన్ని కాపాడుకోవడం నేర్పించారు, ఇది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.' రతన్ టాటా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న వ్యక్తిలలో ఒకరు.

భారతీయులకు చౌకైన కారును అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం నానో కారు అందించారు. నానో కారు చౌకైనా చిన్న కారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల కల నెరవేర్చిన రతన్ టాటాకు కూడా కార్లంటే చాలా ఇష్టం. అతని కార్ల గ్యారేజీలో ఫెరారీ, కాడిలాక్, క్రిస్లర్ సెబ్రింగ్ నుండి మెర్సిడెస్ 500 వరకు విలాసవంతమైన లగ్జరీ కార్లు ఉన్నాయి.

click me!