అనిల్‌ అంబానీ మరో షాక్‌.. ఆస్తుల​ అమ్మకానికి రంగం సిద్ధం!

By Sandra Ashok KumarFirst Published Nov 2, 2020, 5:44 PM IST
Highlights

 అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ (ఆర్‌సిఎల్) రుణదాతలు దాదాపు 20వేల కోట్ల రూపాయల బకాయిలను తిరిగి పొందడానికి దాని కీలక ఆస్తులను విక్రయించే ప్రక్రియను ప్రారంభించాయి. 

ఆర్‌ఐ‌ఎల్ చైర్మన్ అనిల్‌ అంబానీకి మరో షాక్‌ తగలనుంది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ (ఆర్‌సిఎల్) రుణదాతలు దాదాపు 20వేల కోట్ల రూపాయల బకాయిలను తిరిగి పొందడానికి దాని కీలక ఆస్తులను విక్రయించే ప్రక్రియను ప్రారంభించాయి.

 రుణ బకాయిలను తిరిగి పొందేందుకు భాగంగా ఆస్తుల అమ్మకానికి ఆయా బ్యాంకులు సిద్ధ పడుతున్నాయి. దీనికి సంబంధించి ఆసక్తి ఉన్న వర్గాల నుంచి బిడ్లను ఆహ్వానించినట్టు సమాచారం. 

 ఆర్‌సిఎల్ రుణంలో 93 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న డిబెంచర్ హోల్డర్ల కమిటీ (కోడిహెచ్) శనివారం ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఇఒఐ) లను ఆహ్వానించడానికి పత్రాలను జారీ చేసింది. 

also read 

ఈ అనుబంధ సంస్థలలో ఆర్‌సిఎల్ మొత్తం వాటా లేదా కొంత భాగం విక్రయించనుంది. ఇందులో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 51 శాతం వాటా, రిలయన్స్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ ఫైనాన్షియల్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ అసెట్  రీ కన్‌స్ట్రక్షన్‌లో సంస్థలో 49 శాతం వాటా, ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో  20 శాతం వాటా, రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, నాఫా ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పేటీఎం ఇ-కామర్స్ మొదలైన వాటిలో ఆర్‌సిఎల్ చేసిన ఇతర ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను విక్రయించి రుణబకాయిలుగా జమ చేయనుంది.

అయితే తాజా పరిస్థితులపై ఆర్‌సిఎల్ స్పందించాల్సి ఉంది. ఎస్‌బి‌ఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, జెఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రుణదాతల తరపున ఆస్తి మోనటైజేషన్ ప్రక్రియను అమలు చేస్తాయి.

రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు అతిపెద్ద రుణాలు ఇచ్చిన బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి, కొన్ని నెలల క్రితం దివాలా కోడ్ సెక్షన్ 227 ప్రకారం రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆర్‌బి‌ఐని కోరింది, కాని ఆర్‌బి‌ఐ ఈ అభ్యర్థనను తిరస్కరించింది.

click me!