ఒకప్పుడు ఇంటి నుండి బిస్కెట్లు అమ్మే ఆమె నేడు ఒక పెద్ద కంపెనీకి ఎండి: రజిని బెక్టర్స్ సక్సెస్ స్టోరీ

By Sandra Ashok KumarFirst Published Oct 23, 2020, 6:09 PM IST
Highlights

బెక్టర్స్ ఫుడ్ ఎం‌డి రజనీ బెక్టర్ ఒకప్పుడు చిన్న వ్యాపారం ప్రారంభించింది, కానీ నేడు ఆమె కంపెనీ టర్నోవర్ కోట్లలో ఉంది. జీవితంలో చాలా ఇబ్బందులు మనిషిని  ఒత్తిడికి గురి చేస్తాయి, కాని ఈ కష్టాలలో నుండి ధైర్యంగా బయటపడేది కొంతమంది మాత్రమే. అలాంటి వారిలో రజనీ బెక్టర్ ఒకరు.

ఒకప్పుడు ఇంటి నుండి బిస్కెట్లు అమ్మే ఆమె, నేడు ఒక పెద్ద కంపెనీకి ఎండి. ఇప్పుడు ఆ కంపెనీ ఐపిఓ 550 కోట్లు. అసలు ఆ కంపెనీ ఎం‌డి ఎవరు, ఏంటో ఒకసారి చూద్దాం. బెక్టర్స్ ఫుడ్ ఎం‌డి రజనీ బెక్టర్ ఒకప్పుడు చిన్న వ్యాపారం ప్రారంభించింది, కానీ నేడు ఆమె కంపెనీ టర్నోవర్ కోట్లలో ఉంది.

జీవితంలో చాలా ఇబ్బందులు మనిషిని  ఒత్తిడికి గురి చేస్తాయి, కాని ఈ కష్టాలలో నుండి ధైర్యంగా బయటపడేది కొంతమంది మాత్రమే. అలాంటి వారిలో రజనీ బెక్టర్ ఒకరు. వాస్తవానికి రజనీ బెక్టర్ కరాచీలో జన్మించింది.  రజనీ బెక్టర్ కొంత కాలం తరువాత భారతదేశానికి వచ్చారు.

భారతదేశానికి వచ్చిన తరువాత, ఆమే కుటుంబం ఢీల్లీలో స్థిరపడింది. ఆమే  ఇక్కడే పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత ఆమే లూధియానాలో వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత, రజనీ బెక్టర్ బిస్కెట్ తయారీ వృత్తిగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. 1978లో ఆమే ఇంటిలోనే బిస్కెట్లు తయారు చేయడం ప్రారంభించింది.

also read 

నేడు ఆమె కృషి, అభిరుచి వల్ల ఆమె బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీల యజమాని అయ్యింది. ఆమె కంపెనీ బ్రాండ్ కింద ప్రపంచంలోని 50కి పైగా దేశాలకు బిస్కెట్లు, బ్రెడ్, ఐస్ క్రీంలను ఎగుమతి చేస్తున్నారు. ఆమే కంపెనీ వార్షిక టర్నోవర్ సుమారు రూ.700 కోట్లు. రజనీ బెక్టర్ సంస్థ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్సోనాల్డ్స్, బర్గర్ కింగ్ లకు బ్రేడ్ సరఫరా చేస్తుంది.

ఇప్పుడు ఆమే కంపెనీ రూ.550 కోట్ల ఐపీఓ ప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది. బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ కంపెనీ 2018లో కూడా ఐపిఓను ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే ఆమే కొన్ని కారణాల వల్ల ఈ ఆలోచనను విరమించుకున్నారు. బెక్టర్స్ ఫుడ్ ఇంగ్లీష్ ఓవెన్ బ్రాండ్ క్రింద బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తుంది.

ఐపిఓ నుంచి వచ్చే మూలధనంతో పంజాబ్‌లోని రాజ్‌పురాలో ఉన్న తయారీ యూనిట్‌ను కంపెనీ విస్తరిస్తుందని కంపెనీ సెబీకి ఇచ్చిన దరఖాస్తులో తెలిపింది. సంస్థ ఐపిఓ వచ్చే ఏడాది ప్రారంభంలో రావచ్చు, అంటే జనవరి-ఫిబ్రవరిలో.

మార్చి 31, 2020 నాటికి కంపెనీ ఆదాయం 762 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ సమయంలో కంపెనీ 30 కోట్ల రూపాయల పన్ను చెల్లించింది. బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ కంపెనీకి పంజాబ్‌లోని రాజ్‌పురా, హిమాచల్ ప్రదేశ్‌లోని తహ్లివాల్, ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా, మహారాష్ట్రలోని ఖోపోలి, కర్ణాటకలోని బెంగళూరులలో తయారీ యూనిట్లు కూడా ఉన్నాయని తెలిపింది.

click me!