ఇంటి లోన్ గురించి ఆందోళన చెందుతున్నారా..? అయితే తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్న 10 బ్యాంకులు ఇవే..

By Sandra Ashok KumarFirst Published Oct 22, 2020, 2:07 PM IST
Highlights

గృహ రుణల వడ్డీ రేట్లను చాలా బ్యాంకులు సవరించిచాయి. ఇప్పుడు మీ కలల ఇంటిని ఈ పండుగ సీజన్లో సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం కావొచ్చు.

న్యూ ఢీల్లీ: గృహ రుణల వడ్డీ రేట్లను చాలా బ్యాంకులు సవరించాయి.  మీరు కలలు కన్న డ్రీమ్ హోమ్ ఈ పండుగ సీజన్లో సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం కావొచ్చు. దసరా, దీపావళి  పండుగ సీజన్ లో భాగంగా అనేక బ్యాంకులు గృహ రుణల పథకాలపై వివిధ రాయితీలను అందిస్తున్నాయి.

వడ్డీ రేట్ల తగ్గింపు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, మహిళా రుణగ్రహీతలకు అదనపు ప్రయోజనాలు అందిస్తున్నాయి. భారతదేశ అతిపెద్ద రుణదాత ఎస్‌బి‌ఐ గృహ రుణల పథకంలో అనేక ఆఫర్లతో ముందుకు వచ్చింది, పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలను అందిస్తున్నట్లు వాగ్దానం చేస్తుంది.

అయితే కొన్ని కారణాల వల్ల మీరు ఎస్‌బి‌ఐ గృహ రుణల ఆఫర్లను పొందలేకపోతే, గృహ రుణాలపై లాభదాయకమైన ఆఫర్లను అందిస్తున్న 10 బ్యాంకుల జాబితా ఇక్కడ ఉంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై  6.70 శాతం నుండి 7.15 శాతం వరకు అందిస్తోంది. రుణలపై ప్రాసెసింగ్ ఫీజుగా మొత్తం 0.50 శాతం వసూలు చేస్తుంది, ఇది సుమారు రూ.15 వేలకు కంటే మించదు. మరిన్ని వివరాల కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.

also read 

బ్యాంక్ ఆఫ్ ఇండియా: బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం నుండి 7.15 శాతం వడ్డీకె గృహ రుణలను ఇస్తుంది, అయితే బ్యాంక్ వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు రుణం మొత్తంలో 0.25 శాతం. ప్రాసెసింగ్ ఫీజు 1,500 నుండి 20,000 రూపాయల వరకు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం నుండి 7.30 శాతం వడ్డీతో హోమ్ లోన్స్ అందిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం బ్యాంక్ వసూలు చేస్తుంది, ఇది గరిష్ట పరిమితి రూ.20వేలు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.

కెనరా బ్యాంక్: కెనరా బ్యాంక్ 6.90 శాతం నుండి 8.90 శాతం వడ్డీకి గృహ రుణాన్ని అందిస్తుంది, మొత్తం రుణ మొత్తంలో బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజును 0.50 వసూలు చేస్తుంది, ఇది 10,000 రూపాయల వరకు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.

పంజాబ్ & సింధ్ బ్యాంక్: పంజాబ్ & సింధ్ బ్యాంక్ 6.90 శాతం నుండి 7.25 శాతం వరకు గృహ రుణాలపై లోన్ రేటును అందిస్తుంది. ఈ బ్యాంక్ గురించి మంచి విషయం ఏమిటంటే, ప్రాసెసింగ్ ఫీజు, చెకింగ్ ఛార్జీలు  వసూలు చేయదు. మరిన్ని వివరాల కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.
 

click me!