SBI మినహా అన్ని జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరించండి: NCAER నివేదిక

Published : Jul 15, 2022, 07:14 PM IST
SBI మినహా అన్ని జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరించండి: NCAER నివేదిక

సారాంశం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించవచ్చని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) తన నివేదికలో పేర్కొంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మినహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను (PSB) కేంద్రం ప్రైవేటీకరించాలని, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) నివేదిక పేర్కొంది. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణపై NCAER రూపొందించిన నివేదికలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రైవేటీకరణకు ప్రధాన కారణంగా ప్రైవేట్ బ్యాంకులు స్టాక్ మార్కెట్ ద్వారా బలమైన మార్కెట్ కాపిటల్ సేకరించి  జాతీయం బ్యాంకులకు నమ్మకమైన ప్రత్యామ్నాయాలుగా ఉద్భవించాయని నివేదిక పేర్కొంది.  

ఎన్‌సీఏఈఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌, ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ సభ్యురాలు పూనమ్‌ గుప్తా, నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అరవింద్‌ పనగారియా ఈ నివేదికను రూపొందించారు. SBI కాకుండా, ఇతర PSBలు గత దశాబ్దంలో పనితీరు ప్రాతిపదికన చూస్తే, అన్ని కీలక సూచికలలో ప్రైవేట్ బ్యాంకుల కంటే వెనుకబడి ఉన్నాయి.

PSBల పనితీరు చాలా తక్కువగా ఉంది:

ప్రభుత్వ రంగ బ్యాంకులు అస్సెట్స్, ఈక్విటీలపై తక్కువ రాబడిని పొందుతున్నాయి. అయితే డిపాజిట్లు, రుణ అడ్వాన్సుల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు,  ప్రైవేట్‌ బ్యాంకులకు దీటుగా నిలిచాయి. 2014-15 నుండి, బ్యాంకింగ్ రంగంలో దాదాపు మొత్తం వృద్ధిలో ప్రైవేట్ బ్యాంకులు, ఎస్‌బిఐ మాత్రమే ప్రధాన కారణమని పేర్కొంది. “ఈ కాలంలో వాటి పనితీరును పెంపొందించే లక్ష్యంతో అనేక విధాన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ PSBల పనితీరు తక్కువగానే ఉందని తెలిపింది. 

అయితే ప్రభుత్వ బ్యాంకుల పనితీరున చక్కదిద్దే  కార్యక్రమాలలో రీక్యాపిటలైజేషన్, రిక్రూట్‌మెంట్, గవర్నెన్స్ ప్రాక్టీసులను క్రమబద్ధీకరించడంతో పాటు, పనితీరును మరింత ప్రొఫెషనలైజ్ చేయడానికి బ్యాంక్ బోర్డ్ బ్యూరో రాజ్యాంగంలో దిద్దుబాటు కార్యాచరణ ప్రణాళికలు చేయాల్సి ఉందని తెలిపింది. అయితే బ్యాంకుల విలీనాలు, ఏకీకరణ ద్వారా  2016-17 నాటి  27 ప్రభుత్వ బ్యాంకులను ప్రస్తుతం 12కి తగ్గించడంలో ఇది సహాయపడిందని NCAER నివేదిక పేర్కొంది.

అధిక NPAలు కూడా కారణమే..

2010-11 మరియు 2020-21 మధ్య కాలంలో ప్రభుత్వం PSBలకు 65.67 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.5.5 లక్షల కోట్లు) చొప్పించినప్పటికీ, మొండి బకాయిల సంక్షోభం నుండి బయటపడేందుకు, ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే PSBల నిరర్థక ఆస్తులు (NPA) ఎక్కువగానే ఉన్నాయి. SBI మినహా, PSBల మార్కెట్ వాల్యుయేషన్ మే 31, 2022 నాటికి అటువంటి బ్యాంకుల్లో ఇన్ఫ్యూజ్ చేయబడిన నిధుల కంటే "చాలా ఎక్కువ" ఉందని నివేదిక పేర్కొంది. 

ప్రైవేటీకరణకు సిఫార్సు:

“SBIతో సహా అన్ని PSBలకు ప్రైవేటీకరణ కేసు వర్తిస్తుందని మేము ప్రతిపాదిస్తున్నాము. కానీ భారత ఆర్థిక వ్యవస్థ  రాజకీయ విధానంలో, ప్రభుత్వం కనీసం ఒక PSBని తన పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవాలని మేము గుర్తించాము. అందువల్ల, దాని పరిమాణం, మంచి పనితీరును దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతానికి SBI మినహా అన్ని PSBలను ప్రైవేటీకరించడంపై దృష్టి కేంద్రీకరించాలని నివేదిక పేర్కొంది. అయితే  'భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎందుకు, ఎలా, ఎంతవరకూ ప్రైవేటీకరించాలి?' అనే శీర్షికతో ఈ నివేదికలో రాశారు

రెండు బలమైన బ్యాంకులతో ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించాలని నివేదిక పేర్కొంది. "మా దృష్టిలో, మొత్తం 11 PSBల ప్రైవేటీకరణ సమయంలో, ప్రైవేటీకరణ కోసం ఎంపిక చేయబడిన మొదటి రెండు బ్యాంకులు భవిష్యత్ ప్రైవేటీకరణల విజయానికి ఉదాహరణ. ఎంచుకున్న బ్యాంకులు గత ఐదేళ్లలో ఆస్తులు, ఈక్విటీలపై అధిక రాబడి మరియు తక్కువ NPAలను కలిగి ఉండాలి. ," అని పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం, రెండు బలహీన బ్యాంకులను ప్రైవేటీకరించే అవకాశం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు