Tata Elxsi Share: 25 ఏళ్ల క్రితం, జస్ట్ 10 వేలు మీవి కాదనుకొని ఈ స్టాక్ లో పెట్టి ఉంటే..నేడు కోటీశ్వరులు

Published : Jul 15, 2022, 05:33 PM IST
Tata Elxsi Share: 25 ఏళ్ల క్రితం, జస్ట్ 10 వేలు మీవి కాదనుకొని ఈ స్టాక్ లో పెట్టి ఉంటే..నేడు కోటీశ్వరులు

సారాంశం

టాటా గ్రూప్ స్టాక్ అంటే బ్రోకర్లకు ఎప్పుడూ మంచి విందు భోజనమే. ఇప్పుడు టాటాకు చెందిన మరో ఐటీ కంపెనీ స్టాక్ శుక్రవారం భారీ పెరుగుదలను నమోదు చేసింది. సరిగ్గా ఓ పాతికేళ్ల క్రితం ఈ స్టాక్‌లో జస్ట్ 10 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారి వద్ద నేడు అక్షరాల కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉండేవి.

టాటా గ్రూప్ కంపెనీలను ఫట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం అంతా ఇంతా కాదు. గ్రూపులోని అన్ని కంపెనీలు ఇప్పటికీ ఇన్వెస్టర్లకు చక్కటి లాభాలు తెచ్చి పెట్టే బంగారు బాతులు, ఏ దశలోనూ ఈ కంపెనీ స్టాక్స్  స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లను నిరాశపరచడం లేదు. టాటా గ్రూప్‌లోని పలు షేర్లు ఇన్వెస్టర్లను మిలియనీర్లను చేశాయి. స్టాక్ మార్కెట్‌లో బిగ్ బుల్ అని పిలుచుకునే రాకేష్ జున్‌జున్‌వాలా టాటా గ్రూప్ షేర్లను చాలా ఇష్టపడతారు. ఈ  వారంలో చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం, టాటా గ్రూప్‌లోని ప్రధాన ఐటీ షేర్ అయిన టాటా ఎలెక్సీ Tata Elxsi Share విపరీతమైన పెరుగుదలను నమోదు చేసింది.

ఒక ట్రేడింగ్ సెషన్‌లో 250 రూపాయలు
ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి, Tata Elxsi Share శుక్రవారం రూ.250 లాభంతో రూ.8,050.40 (3.22 శాతం) వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ట ధర రూ. 4,107.05, గరిష్టం రూ. 9,420 గా గుర్తించాలి. మొదటి త్రైమాసిక ఫలితాల విడుదల తర్వాత కంపెనీ స్టాక్‌లో ఈ బలం పెరిగింది. గురువారం నాడు, క్యూ1 ఆదాయాల గణాంకాలను Tata Elxsi సమర్పించింది. ఇందులో విపరీతమైన వృద్ధి నమోదైంది.

Tata Elxsi  చరిత్ర ఇదే..
టాటా గ్రూప్ యొక్క ఈ షేర్ మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటి, ఇది గత కొన్ని సంవత్సరాలలో అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఈ ఐటీ స్టాక్ గత ఏడాది కాలంలో 80 శాతం రాబడిని ఇచ్చింది. అదే సమయంలో, ఇది 5 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు 850 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది.

25 ఏళ్లలో 10 వేల నుంచి 1 కోటి
గత 25 ఏళ్లలో ఈ స్టాక్ కదలికలను పరిశీలిస్తే, ఇది లక్ష శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. జూలై 1997లో, ఈ స్టాక్ BSEలో రూ.7.68గా ఉంది. జూలై 15. 2022న 8,050 వద్ద ముగిసింది. అంటే.. అప్పట్లో ఎవరైనా ఈ షేర్‌లో 10 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి తన పెట్టుబడిని వెనక్కి తీసుకోకపోతే, నేడు ఆ సంపద దాదాపు రూ.1 కోటి 4 లక్షలకు పెరిగి ఉండేది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Car Loan: న్యూ ఇయ‌ర్‌లో కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? త‌క్కువ వ‌డ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులివే
Business Idea: ఈ బిజినెస్ ఐడియా గురించి తెలిస్తే మ‌తిపోవాల్సిందే.. సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా బ‌లాదూర్ అంటారు