ప్రైవేట్ ట్రేయిన్ ఛార్జీల నిర్ణయంలో ప్రభుత్వ జోక్యం ఉండదు: రైల్వే బోర్డు చైర్మన్

Ashok Kumar   | Asianet News
Published : Sep 19, 2020, 06:36 PM ISTUpdated : Sep 19, 2020, 10:54 PM IST
ప్రైవేట్ ట్రేయిన్ ఛార్జీల నిర్ణయంలో ప్రభుత్వ  జోక్యం  ఉండదు: రైల్వే బోర్డు చైర్మన్

సారాంశం

ప్రైవేట్ రైళ్లను నడపడానికి ప్రైవేట్ సంస్థలను ఆకర్షించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్ల ఛార్జీలను తమదైన రీతిలో నిర్ణయించడానికి ప్రైవేటు సంస్థలకు స్వేచ్ఛ ఇస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వి.కె. యాదవ్ తెలిపారు. 

ప్రైవేట్ రైళ్లను నడపనున్న కంపెనీలు రైలు ఛార్జీలను స్వయంగా నిర్ణయిస్తాయి. ఇందులో ప్రభుత్వం నుండి ఎటువంటి జోక్యం ఉండదు. ప్రైవేట్ రైళ్లను నడపడానికి ప్రైవేట్ సంస్థలను ఆకర్షించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రైళ్ల ఛార్జీలను తమదైన రీతిలో నిర్ణయించడానికి ప్రైవేటు సంస్థలకు స్వేచ్ఛ ఇస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వి.కె. యాదవ్ తెలిపారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం  వి.కె.యాదవ్ ప్రజా రవాణా ప్రైవేటీకరణలో  ఇప్పటికే ఎసి బస్సులు, విమానాలు నడుస్తున్నాయని, భారతదేశంలో ప్రతిరోజూ ఎంతో మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తారు.

రైలు ఛార్జీలు ఇండియాలో సున్నితమైన సమస్య అని అన్నారు.అటువంటి పరిస్థితిలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకత కూడా రాబోయే రోజుల్లో చూడవచ్చు. దేశంలో చాలా వరకు ప్రజలు రైళ్ల రాకపోకలపై  ఆధారపడి ఉన్నారు.

also read  ఫ్యాన్లపై జీఎస్టీని తగ్గించండి.. ప్రభుత్వాన్ని కోరిన ఐఎఫ్‌ఎంఏ ...

ప్రైవేటు రైళ్ల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు కోరినట్లు వివరించారు. జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదానీ ఎంటర్ప్రైజెస్, బొంబార్డియర్, ఆల్స్టోమ్ సహా అనేక దిగ్గజాలు ప్రైవేట్ రైళ్లను నడపడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. రైల్వే మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం రాబోయే 5 సంవత్సరాలలో రైల్వేలలో 7.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి జరగవచ్చు.

జూలైలో 109 రూట్లలో 151 ప్రైవేట్ రైళ్లను నడపడానికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇవే కాకుండా ఢీల్లీ, ముంబై రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు కాంట్రాక్టు కూడా ఇవ్వనున్నారు. న్యూ ఢీల్లీ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంలో అదానీ గ్రూప్ కంపెనీలు కూడా పాల్గొన్నాయని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు