కరోనా వైరస్ వ్యాప్తి వల్ల సామాన్య ప్రజలు, ఉద్యోగుల, వ్యాపారుల ఆదాయం తగ్గిపోయింది. ఉద్యోగులు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నా వారికి గుడ్ న్యూస్. ఏంటంటే ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు తీయని కబురు అందించింది. క్రెడిట్ కార్డు బిల్లుపై మారటోరియం ఫెసిలిటీ అందిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
ఆర్‌బిఐ లోన్ మారటోరియం ఫెసిలిటీని మళ్ళీ పొడిగించింది. మొదట మారటోరియం మే 31 వరకు పొడిగించిన తరువాత మళ్ళీ ఆగస్ట్ 31 వరకు పొడిగించింది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల వాహన రంగం, సేల్స్ ఇలా అన్నీ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో మారటోరియం మరోసారి మళ్ళీ పొడిగించింది. ఇప్పుడు బ్యాంకులు కూడా ఆర్‌బీఐ బాటలోనే నడుస్తున్నాయి. దీని వల్ల ఆగష్టు నెల వరకు కస్టమర్లుకి ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల సామాన్య ప్రజలు, ఉద్యోగుల, వ్యాపారుల ఆదాయం తగ్గిపోయింది. ఉద్యోగులు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నా వారికి గుడ్ న్యూస్. ఏంటంటే ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు తీయని కబురు అందించింది. క్రెడిట్ కార్డు బిల్లుపై మారటోరియం ఫెసిలిటీ అందిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో ఈ ఆప్షన్ ఎంచుకున్న వారు క్రెడిట్ కార్డు బిల్లు ఆగస్ట్ 31 వరకు చెల్లించాల్సిన పని లేదు.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఇటీవలనే లోన్ మారటోరియం ఫెసిలిటీ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని టర్మ్ లోన్స్‌కు, క్రెడిట్ కార్డు బకాయిలకు ఇది వర్తిస్తుంది అని తెలిపింది. దీంతో దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) కూడా లోన్ ఈఎంఐ మారటోరియం ఫేసిలిటీని మరో 3 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఈ జాబితాలో చేరింది.
also read లాక్ డౌన్ లో ఏషియన్ పెయింట్స్ కొత్త సర్వీస్...కరోనా వ్యాపించకుండా పెయింటింగ్..
అయితే క్రెడిట్ కార్డు బిల్లుపై మారటోరియం ఆప్షన్ ఎంచుకునే వారు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మారటోరియం గడువు అయిపోయిన తర్వాత జనరేట్ అయిన క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మీరు నిర్వహించిన లావాదేవీలు, అలాగే వీటిపై వడ్డీ వంటివి అన్నీ ఉంటాయి.
ఒకవేళ క్రెడిట్ కార్డుపై ఈఎంఐ ఉంటే ఈఎంఐ మాత్రం నెలవారీ బిల్లు చెల్లించాలి. ఒకవేళ కట్టకపోతే దానిపై వడ్డీ పడుతుంది. ఒకవేళ ఆటో డెబిట్ ఫెసిలిటీని యాక్టివేట్ చేసుకొని ఉంటే మారటోరియం ఎంచుకుంటే డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ కావు. మీరు ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉపయోగిస్తూ ఉంటే అప్పుడు ప్రతి కార్డుకు మారటోరియం ఫెసిలిటీ వర్తిస్తుంది.
ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే క్రెడిట్ కార్డు బిల్లుకు మారటోరియంను ఒకేసారి ఒక నెల కన్నా ఎక్కువగా పొందటం సాధ్యం కాదు. అందువల్ల ప్రతి నెలా మారటోరియం కోసం అప్లై చేసుకోవలసి ఉంటుంది. అంటే ఒకేసారి మూడు నెలలకు మారటోరియం ఫెసిలిటీ పొందలేం. ప్రతి నెలా అప్లై చేసుకోవాల్సిందే.