ప్రముఖ పెయింట్స్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ తమ కస్టమర్లు, ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పద్ధతులను పాటిస్తున్నట్లు చూపించారు.
దేశంలో లాక్ డౌన్ అమలుపరిచి దాదాపు రెండు నెలలు కావొస్తుంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆంక్షల సడలింపుతో ప్రస్తుతం లాక్ డౌన్ 4వ దశ నుండి మనం ఇప్పుడు 5 వ దశలో ఉన్నాము. గడిచిన ఈ రెండు నెలల్లో ఫేస్ మాస్క్ లేకుండా బయటికి రాకపోవడం, సానిటైజేషన్ పాటించడం, ఉద్యోగులకు వర్క్ ఫ్రోం హోం, సామాజిక దూరం పాటించడానికి ఆన్‌లైన్ షాపింగ్ పై ఎక్కువ మక్కువ చూపెట్టడం వంటి అనేక కొత్త పద్ధతులను ప్రజలు అలవాటు చేసుకుంటున్నారు. ఇది మనం మార్పులకు తగ్గట్టుగా పరిస్థితులకు అనుగుణంగా ఉండడానికి అలవాటు చేస్తుంది.
ప్రముఖ పెయింట్స్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ తమ కస్టమర్లు, ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పద్ధతులను పాటిస్తున్నట్లు చూపించారు.
ఏషియన్ పెయింట్స్ సంస్థ ప్రవేశపెట్టిన కొత్త ‘సేఫ్ పెయింటింగ్ సర్వీసెస్’ ద్వారా కొత్త ఆవిష్కరణలు, భద్రతల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వహిస్తుందో చూపించింది. సంస్థ ప్రారంభించిన కొత్త బ్రాండ్ క్యాంపైన్ కూడా దీనికి నిదర్శనంగా నిలుస్తుంది.
అయితే ఈ కొత్త ‘సేఫ్ పెయింటింగ్ సర్వీసెస్’ సేవలు దేశంలోని అన్నీ ప్రధాన నగరాల్లో ప్రవేశపెట్టారు. డస్ట్ ఫ్రీ మేకనైజేడ్ పెయింటింగ్ టెక్నిక్ ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెయింటింగ్ పనిని పూర్తి చేయడంలో పాల్గొనేవారి సంఖ్యను కూడా తగ్గిస్తుంది. ఇది పెయింటింగ్ చేసే వారి మాధ్య, ఇంకా ఇంటి యజమానుల నుండి సామాజిక దూరాన్ని పాటించడానికి సహాయపడుతుంది.
పెయింటింగ్ చేసే వారు పని చేయడానికి ముందు, ఆ తరువాత కూడా సానిటైజేషన్ పాటించేలా అన్ని చర్యలను తీసుకుంటున్నారు.
also read కరంట్ బిల్లు లక్ష దాటితే ఐటీ రిటర్న్స్ తప్పనిసరి...
పెయింటింగ్ చేసే వారు ఏదైనా ఒక ప్రదేశంలో పనిచేయడానికి వచ్చినప్పుడు, మొదటగా ఫేస్ మాస్క్‌లు దరించడం, అలాగే పనిచేసేటప్పుడు ఫుల్ బాడీ మస్కూలు ధరించడం, సానిటైజేషన్ ద్వారా పనిని ప్రారంభిస్తారు. అలాగే వారు ఆ రోజు పనిని పూర్తి చేసుకొని వెళ్ళేముందు కూడా పూర్తి సానిటైజేషన్ పద్దతిని పాటిస్తారు. వారు పనిచేసిన ప్రాంతాన్ని కూడా మళ్లీ సానిటైజేషన్ చేస్తారు.
వారికీ అప్పగించిన పనిలో కలుషితం లేదా ఇతర వంటి వల్ల వైరస్ వ్యాపించకుండా క్రిమిసంహారక మందులను ఉపయోగించుతారు. ఇలా చేయటం వల్ల ఇంటి యజమానులతో పాటు ఇతరులు కూడా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేలా ఉంచుతాయి.
లాక్ డౌన్ లేదా కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రజల పనులకు ఆటంకం కలగకుండా, ఇంకా సాధారణ జీవితంపై ఎలాంటి ప్రభావితం చేయకుండా ఉండటానికి ఆసియా పెయింట్స్ తీసుకున్న అనేక కార్యక్రమాలలో ఈ ‘సేఫ్ పెయింటింగ్ సర్వీస్’ ఒకటి.
ఇది చాలా మందికి ముఖ్యంగా ఉద్యోగులకు వారి ఆరోగ్యం, జీవనోపాధి కోసం కంపెనీ నిజంగా శ్రద్ధ వహిస్తుందని తెలుపుతుంది. కోవిడ్-19కు వ్యతిరేకంగా ముందంజలో ఉండి పోరాడుతున్న వారి కోసం అంకితం చేసిన ఒక కొత్త పాటకి స్పాన్సర్ గా ఇటీవల ఏషియన్ పెయింట్స్ కూడా ప్రభుత్వంతో చేతులు కలిపింది.
ఈ పాట పేరు వన్ నేషన్, వన్ వాయిస్. ఏషియన్ పెయింట్స్ సంస్థ పిఎమ్ కేర్స్ ఫండ్, భారతదేశంలోని వివిధ సిఎం ఫండ్లకు 35 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. ఆసియా పెయింట్స్ సంస్థ చాలా కార్యక్రమాలు ప్రజలను ప్రేరేపించడమే కాక, మెరుగైన, అందమైన భవిష్యత్తు కోసం వారికి ఆశను కలిగిస్తుంది.