ముకేశ్ అంబానీ చెల్లె నీనా కొఠారి గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే..

By Ashok Kumar  |  First Published Jul 8, 2024, 2:07 PM IST

కొఠారీ షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్‌గా నీనా తన సామ్రాజ్యాన్ని సైలెంట్ గా అభివృద్ధి చేసి వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఒక గొప్ప  స్థానాన్ని ఏర్పరుచుకుంది.
 


ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య, పిల్లలు,  కోడలు ఇంకా వారి లగ్జరీ లైఫ్ స్టయిల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే అతని చెల్లె నీనా కొఠారి గురించి మీకు తెలుసా?

భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ కుటుంబం ఎప్పుడూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖేష్ అంబానీ, ఆయన భార్య, పిల్లలు, కోడలు, అల్లుడు, మనవరాళ్లు ఇలా దాదాపు అందరికీ వారి గురించి తెలుసు. 

Latest Videos

అయితే ముఖేష్‌ అంబానీకి ఇద్దరు చెల్లెల్లు ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు. ఈ ఇద్దరు అంబానీ చెల్లెళ్లలో నీనా కొఠారి చిన్నది. అత్యంత ధనిక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న నీనా కొఠారి కూడా వ్యాపారవేత్త, ఆమెకు అన్నలాగే  భారీ సంపద ఉంది.

కొఠారీ షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్‌గా నీనా తన సామ్రాజ్యాన్ని సైలెంట్ గా అభివృద్ధి చేసి వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఒక గొప్ప  స్థానాన్ని ఏర్పరుచుకుంది.

ఆమె 1986లో వ్యాపారవేత్త భద్రశ్యామ్ కొఠారిని వివాహం చేసుకుంది. అయితే ఆమె భర్త 2015లో క్యాన్సర్‌తో మరణించారు. ఆమె కుమార్తె నయనతార కొఠారి, కుమారుడు అర్జున్ కొఠారితో కలిసి నివసిస్తున్నారు.  ఆమె 2003లో జావగ్రీన్ ఫుడ్ & కాఫీ ఫ్రాంచైజీని ప్రారంభించారు.  

ఏప్రిల్ 8, 2015న నీనా భర్త మరణించిన తర్వాత కుటుంబ వ్యాపారమైన కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌కి చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఆమె ఓర్పు, దృఢమైన సంకల్పంతో వ్యాపారాన్ని విజయపథంలో నడిపించారు. 

ఛైర్‌పర్సన్ పాత్రతో పాటు, నీనా హెచ్‌సి కొఠారీ గ్రూప్ నిర్వహిస్తున్న మరో రెండు కంపెనీలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు: అవి కొఠారి పెట్రోకెమికల్స్ లిమిటెడ్ & కొఠారి సేఫ్ డిపాజిట్స్ లిమిటెడ్.

ఆమె పెద్ద కుమారుడు అర్జున్ కొఠారి, కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కుటుంబ వ్యాపారాన్ని పెంచడానికి  తల్లితో కలిసి పనిచేస్తున్నాడు. నీనా కుమార్తె నయనతార... KK బిర్లా మనవడు అలాగే శ్యామ్ & శోభనా భర్తీయ  కుమారుడు షమిత్ భర్తీయని పెళ్లి  చేసుకుంది.

నీనా కొఠారి మొత్తం సంపద  విలువ రూ.52.4 కోట్లకు పైగా ఉంటుంది  ఇంకా రెండు పబ్లిక్‌గా ట్రేడెడ్ స్టాక్స్  ఉన్నాయి. కొఠారి షుగర్స్ & కెమికల్స్ లిమిటెడ్ అనేది ఒక చక్కెర పరిశ్రమ కంపెనీ, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ రూ. 435 కోట్లు. 

click me!