ఏ రాజకీయ పార్టీకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా : టాప్ ప్లేస్ ఎవరంటే...?

By asianet news telugu  |  First Published Dec 4, 2023, 12:07 PM IST

 అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో సమాజ్ వాదీ పార్టీ (SP) మొత్తం ఆస్తుల విలువ రూ. 561.46 కోట్లను ప్రకటించింది, అయితే 2021-22లో 1.23 శాతం పెరిగి రూ. 568.369 కోట్లకు చేరుకుంది.
 


నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మధ్య రాజకీయ పార్టీలకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. 2021-22 సంవత్సరానికి ప్రాంతీయ పార్టీలలో అత్యధిక ఆస్తులను సమాజ్‌వాదీ పార్టీ (SP) ప్రకటించింది. ఆ తర్వాత తెలంగాణ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) రెండో స్థానంలో నిలిచింది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కంటే  కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించి  అధికారంలోకి రానుంది. అయితే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో, సమాజ్‌వాదీ పార్టీ మొత్తం ఆస్తుల విలువ రూ. 561.46 కోట్లను ప్రకటించింది, అయితే  2021-22లో 1.23 శాతం పెరిగి రూ. 568.369 కోట్లకు చేరుకుంది.

సమాజ్‌వాదీ పార్టీ తర్వాత భారతియ రాష్ట్ర సమితి  (BRS) 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆస్తులు రూ. 319.55 కోట్లు. ఇక  FY 2021-22లో రూ. 512.24 కోట్లుగా ప్రకటించింది. రెండేళ్లలో డీఎంకే, బీజేడీ, జేడీ(యూ)ల ఉమ్మడి ఆస్తులు 95 శాతం పెరిగాయి.

Latest Videos

undefined

ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) 2020-21లో రూ. 115.708 కోట్ల ఆస్తులను ప్రకటించింది, కానీ  2021-22లో రూ. 399 కోట్లకు 244.88 శాతం పెరిగింది. బిజూ జనతాదళ్ 2020-21లో రూ. 194 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించింది, 2021-22లో 143 శాతం పెరిగి రూ. 474 కోట్లకు చేరగా, జెడి (యుఎస్) 2020-21లో రూ. 86 కోట్ల ఆస్తులను ప్రకటించింది. 2021-22లో చూస్తే 95 శాతానికి పైగా రూ.168 కోట్లకు చేరుకుంది.

అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆస్తులు 2020-21 నుండి 2021-22 మధ్య 71.76 శాతం పెరిగి రూ.21.82 కోట్ల నుంచి రూ.37.477 కోట్లకు పెరిగాయి. టాప్ 10 పార్టీల్లో ఏఐఏడీఎంకే, టీడీపీ మాత్రమే వార్షిక ఆస్తులు వరుసగా 1.55 శాతం, 3.04 శాతం తగ్గాయని నివేదిక పేర్కొంది.   

2020-21 నుండి  2021-22 ఆర్థిక సంవత్సరాల మధ్య ఏఐఏడీఎంకే ఆస్తులు రూ.260.166 కోట్ల నుంచి రూ.256.13 కోట్లకు తగ్గాయి. ఈ క్రమంలో టీడీపీ ఆస్తులు రూ.133.423 కోట్ల నుంచి రూ.129.372 కోట్లకు తగ్గాయి.

click me!