Bank Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం..అప్లై చేయండిలా...

Published : Apr 30, 2022, 03:45 PM ISTUpdated : May 07, 2022, 05:45 PM IST
Bank Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం..అప్లై చేయండిలా...

సారాంశం

PNB SO Recruitment 2022: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్పెషలిస్ట్ ఆఫీసర్స్(SO)  145 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం ప్రభుత్వ బ్యాంకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.

PNB SO Bharti 2022: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేయడానికి లింక్‌ను యాక్టివేట్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 7 మే 2022. నోటీసు ప్రకారం, స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుకు మొత్తం 145 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 40 రిస్క్‌ మేనేజర్‌, 100 క్రెడిట్‌ మేనేజర్‌, 5 సీనియర్‌ మేనేజర్‌ ఖాళీలు ఉన్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2022 12 జూన్ 2022న నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

పే స్కేలు ఇదే...
క్రెడిట్ మేనేజర్-
రూ. 48170-1740/1-49910- 1990/10-69810
రిస్క్ మేనేజర్ - రూ. 48170-1740/1-49910- 1990/10-69810
సీనియర్ మేనేజర్ ట్రెజరీ - రూ.63840-1990/5-73790- రూ.2220/2-78230

ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
>>  మేనేజర్ క్రెడిట్- అభ్యర్థి కనీసం 60% మార్కులతో CA/CWA/CFA లేదా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఫైనాన్స్‌లో పూర్తి సమయం MBA లేదా ఫైనాన్స్‌లో PGDM.

>>  రిస్క్ మేనేజర్- CA/CWA/CFA లేదా కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్. అలాగే ఫైనాన్స్‌లో ఫుల్ టైమ్ ఎంబీఏ.

>> సీనియర్ మేనేజర్ - CA/CWA/CFA లేదా కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్. అలాగే ఫైనాన్స్‌లో ఫుల్ టైమ్ ఎంబీఏ.

PNB SO Recruitment 2022: వయో పరిమితి
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనిష్ట వయస్సు పరిమితి 25 సంవత్సరాలు కాగా, గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు (01.01.2022 నాటికి).

PNB SO Recruitment 2022: దరఖాస్తు రుసుము
SC, ST, PWD: ఒక్కో అభ్యర్థికి రూ. 50/- (ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే) + GST వర్తిస్తుంది
మిగతా అభ్యర్థులందరూ: ఒక్కో అభ్యర్థికి రూ. 850/- + GST వర్తిస్తుంది

PNB SO Recruitment 2022: ఎంపిక విధానం
అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
 

PREV
click me!

Recommended Stories

ఆరోజు రూ. ల‌క్ష పెట్టుబ‌డి పెట్టుంటే.. ఈరోజు రూ. 14 కోట్లు అయ్యేవి. స్టాక్ మార్కెట్ మ్యాజిక్ అంటే ఇదే
EPFO: పీఎఫ్ ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌.. పీపీఓ నెంబ‌ర్ మ‌ర్చిపోయారా.? ఎలా పొందాలంటే