Indian Economy: కొవిడ్​ నష్టం రూ. 52 లక్షల కోట్లు.. ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే 12 ఏళ్లు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 30, 2022, 03:43 PM IST
Indian Economy: కొవిడ్​ నష్టం రూ. 52 లక్షల కోట్లు.. ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే 12 ఏళ్లు..!

సారాంశం

కొవిడ్-19 మహమ్మారి వల్ల సంభవించిన నష్టాల నుంచి భారత దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే దాదాపు 10 సంవత్సరాలు పడుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నివేదిక అంచనా వేసింది. ఈ మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావాన్ని విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించింది.   

కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల వ్యవధిలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ.. ఎన్నడూ లేని విధంగా దెబ్బతింది. భారత ఆర్థిక వ్యవస్థపైనా కొవిడ్​ ప్రభావం దారుణంగానే పడింది. అయితే.. కొవిడ్​ సృష్టించిన అల్లకల్లోలం నుంచి పూర్తిగా కోలుకునేందుకు.. భారత ఆర్థిక వ్యవస్థకు 12 ఏళ్లు పడుతుందని ఆర్​బీఐ నివేదిక వెల్లడించింది.

భారత ఆర్థిక వ్యవస్థపై కొవిడ్​ ప్రభావం అనే అంశం మీద 'స్కార్స ఆఫ్​ పాండెమిక్​' అనే పేరుతో ఆర్​బీఐ ఈ నివేదికను రూపొందించింది. కరోనా కాలంలో దేశానికి రూ. 52 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది.2020 మార్చిలో కొవిడ్​ తొలిసారి దేశం తలుపుతట్టింది. ఫలితంగా ప్రభుత్వం లాక్​డౌన్​ అస్త్రాన్ని ప్రయోగించింది. ఇక కోలుకుంటున్న దశలో రెండో వేవ్​.. 2021 ఏప్రిల్​లో దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు.. మూడో వేవ్​ కారణంగా 2022 జనవరిలో వ్యాపారాలు మళ్లీ మూతపడ్డాయి. ఇలా కొవిడ్​ వేవ్​లతో భారత జీడీపీ వృద్ధి సైతం దెబ్బతిందని ఆర్​బీఐ నివేదిక పేర్కొంది.
కరోనాతో భారత్​కు 2020-21లో రూ. 19.1లక్షల కోట్లు, 2021-22లో 17.1లక్షల కోట్లు, 2022-23లో 16.4లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని నివేదిక పేర్కొంది. 

అయితే కరోనాకు అడ్డుకట్టవేసేందుకు ప్రయోగించిన అస్త్రాల ఫలితాలు.. భవిష్యత్తులో దేశానికి అందుతాయని ఆర్​బీఐ నివేదిక అభిప్రాయపడింది. కొవిడ్​ ముందున్న ప్రపంచాన్ని తీసుకురావడం కష్టమని, కరోనా అనంతరం ఏర్పడిన మార్పులతోనే జీవించాలని స్పష్టం చేసింది. ఈ నివేదికను ఆర్​బీఐకు చెందిన డీఈపీఆర్​(డిపార్టమెంట్​ ఆఫ్​ ఎకనామిక్​ అండ్​ పాలసీ రీసెర్చ్​) రూపొందించింది. రిపోర్టులోని అంశాలు పూర్తిగా డీఆర్​పీఆర్​దేనని, తమకు సంబంధం లేదని ఆర్​బీఐ వెల్లడించింది.

కొవిడ్-19 మహమ్మారి సమయంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన ఆదాయ నష్టం దాదాపు రూ.52 లక్షల కోట్లు అని అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ (ఆర్‌సీఎఫ్)లో ‘మహమ్మారి మచ్చలు’ అనే అధ్యాయంలో ఈ మహమ్మారి ప్రభంజనాలు పదే పదే రావడం వల్ల నిలకడగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఆటంకాలు ఏర్పడినట్లు తెలిపింది. జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో త్రైమాసిక ధోరణులు ఈ మహమ్మారి ఆటుపోట్లకు గురైనట్లు పేర్కొంది. 2020-21 తొలి త్రైమాసికంలో తీవ్రమైన క్షీణత నమోదైన తర్వాత 2021-22 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రెండో ప్రభంజనం వచ్చే వరకు ఆర్థిక వ్యవస్థ వేగం క్రమంగా పుంజుకుందని తెలిపింది. అదే విధంగా 2022 జనవరిలో మూడో ప్రభంజనం వల్ల ఆర్థిక వ్యవస్థ కోలుకునే ప్రక్రియకు పాక్షికంగా దెబ్బతగిలిందని పేర్కొంది. 

 

PREV
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?