PM SVANidhi: ఎటువంటి హమీ లేకుండా రూ. 20000 వేల రుణం.. దరఖాస్తు చేసుకోండిలా..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 04, 2022, 12:32 PM IST
PM SVANidhi: ఎటువంటి హమీ లేకుండా రూ. 20000 వేల రుణం.. దరఖాస్తు చేసుకోండిలా..!

సారాంశం

వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ది చేసుకోవడానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది పీఎం స్వీనిధి. ఈ పథకాన్ని 2020 జూన్‌ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వ్యాపారులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  

చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం PM SVANIdhi పథకాన్ని ప్రారంభించింది. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసాను అందించే 'పీఎం స్ట్రీట్‌వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి' (పిఎం స్వయానిధి) పేరుతో ఈ పథకాన్ని ప్రారంబించారు.  ఈ పథకం కింద అర్హులైన వారు ఎలాంటి హామీ లేకుండా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  ప్రారంభ రుణం రూ. 10,000 వరకు లభిస్తోంది. ఈ నిధులను ఏడాదిలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది,

.రుణం కోసం ఎలా దరఖాస్తు చేయాలి..?

ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద  రుణం తీసుకోవాలనుకునే వారు ప్రధానమంత్రి స్వనిధి వెబ్‌సైట్‌‌కి https://pmsvanidhi.mohua.gov.in/ వెళ్లి నేరుగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్‌ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. అయితే పథకం కింద రుణం పొందే వీధి వ్యాపారులు అంతకు ముందు ఎలాంటి రుణాలు పెండింగ్‌ ఉండకూడదు.

దరఖాస్తు ప్రక్రియ

- పీఎం స్వానిధి పథకం కింద రుణం తీసుకోవాలనుకునే వారు ముందుగా పీఎం స్వానిధి వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

- మీరు ఈ లింక్ ద్వారా ఆ వెబ్‌సైట్‌కి వెళ్లవచ్చు.

- అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. రూ. 10,000 లోన్, రూ. 20,000 లోన్‌తో పాటు లోన్ స్టేటస్ వంటి అనేక ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత రూ. 10,000 లేదా రూ. 20,000 రుణాన్ని ఎంచుకోండి.

- కొత్త విండో తెరుచుకుంటుంది. మీరు మీ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

- ఇప్పుడు మీకు OTP వస్తుంది. OTP నమోదు చేసిన తర్వాత అవసరమైన పత్రాలను అందించాలి. దీని ద్వారా దరఖాస్తు సమర్పణ ప్రక్రియను పూర్తి అవుతుంది. ఈ రుణం పొందడానికి వ్యాపారికి గుర్తింపు కార్డు అవసరం.

- ప్రారంభం, రూ. 10,000 లభిస్తాయి. దాన్ని తిరిగి చెల్లించిన వారు మాత్రమే రూ. 20,000 పొందే అవకాశం ఉంటుంది

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వడ్డీ రేటు తగ్గకున్నా.. రూ. 50 లక్షల హోం లోన్‌పై డబ్బు ఆదా చేయండిలా..
Savings: రోజుకు రూ. 300 ప‌క్క‌న పెడితే.. రూ. 40 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు