PM svanidhi scheme:షురిటీ లేకుండా 10 వేల లోన్.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Ashok Kumar   | Asianet News
Published : Feb 21, 2022, 05:29 PM IST
PM svanidhi scheme:షురిటీ లేకుండా 10 వేల లోన్.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

సారాంశం

 డబ్బు కొరత కారణంగా కొన్నిసార్లు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మీరు ఏదైనా చిన్న పనిని ప్రారంభించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీకు సహాయం అందిస్తుంది. 

మాన జీవనోపాధికి డబ్బు అవసరం. దీనికోసం కొందరు ఉద్యోగం చేస్తుంటే, మరికొందరు వ్యాపారం చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు మనకు అకస్మాత్తుగా డబ్బు అవసరం ఏర్పడుతుంది. చాలా మంది ఉద్యోగంతో కలత చెందుతుంటారు ఇందుకు వ్యాపారం చేసే దిశగా అడుగులు వేయాలనుకుంటుంటారు.

అయితే డబ్బు కొరత కారణంగా కొన్నిసార్లు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మీరు ఏదైనా చిన్న పనిని ప్రారంభించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీకు సహాయం అందిస్తుంది. అదేంటంటే ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ప్రభుత్వం.   ఈ పథకం కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలీ, అర్హత ఏంటి మొదలైనవి తెలుసుకోవడం అవసరం ?  కాబట్టి  ఈ ప్రధాన మంత్రి స్వనిధి యోజన గురించి  వివరంగా తెలుసుకొని ప్రయోజనాన్ని పొందవచ్చు...

ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు
మీరు పి‌ఎం స్వనిధి యోజన పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మీరు సమీపంలోని ఏదైనా ప్రభుత్వ బ్యాంకుకు వెళ్లి దాని ఫారమ్‌ను నింపాలి. ఫారమ్ నింపడంతో పాటు మీరు ఆధార్ కార్డ్ ఫోటో కాపీ, మీ బ్యాంక్ సమాచారాన్ని ఇవ్వాలి. దీని తర్వాత మీ ధరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత డబ్బు మీ ఖాతాకు జమచేయబడుతుంది.

వడ్డీ లేకుండా రుణం 
రుణ  గురించి మాట్లాడినట్లయితే ప్రభుత్వం 10 వేల రూపాయల రుణాన్ని ఇస్తుంది. ఈ డబ్బుపై ఎలాంటి వడ్డీ విధించదు. ప్రతినెలా వాయిదాలు చెల్లించడం ద్వారా ఈ మొత్తం రుణం డబ్బును ఒక సంవత్సరంలోపు తిరిగి చెల్లించడానికి మీకు సమయం లభిస్తుంది. ఈ డబ్బు మీ ఖాతాలో మూడు నెలల వాయిదాలలో ఇవ్వబడుతుంది, దీనికి మీకు ఎటువంటి హామీ అవసరం లేదు.

 ఈ డాక్యుమెంట్స్ అవసరం:-
ఆధార్ కార్డ్
వర్క్ ప్రూఫ్ 
బ్యాంక్ ఖాతా సమాచారం.


ఈ రుణం ఎవరికి లభిస్తుంది?
కరోనా కాలంలో ప్రజలు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. దీని కోసం వీధి వ్యాపారులు దరఖాస్తు చేసుకోవచ్చు. 24 మార్చి 2020లోపు  ఏదైనా వీధి వ్యాపారం చేసిన వారు ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?