EPFO adds: ఈపీఎఫ్ఓలో కొత్తగా చేరిన‌ సభ్యులు 14.6 లక్షలు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 21, 2022, 04:49 PM IST
EPFO adds: ఈపీఎఫ్ఓలో కొత్తగా చేరిన‌ సభ్యులు 14.6 లక్షలు..!

సారాంశం

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో 2021 డిసెంబర్ నెలలో 14.6 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు చేరినట్లు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో 2021 డిసెంబర్ నెలలో 14.6 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు చేరినట్లు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంఖ్య అంతకుముందు డిసెంబర్ నెలలో చేరిన సబ్‌స్క్రైబర్లు 12.54తో పోలిస్తే 16.4 శాతం అధికం. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం 2021 నవంబర్ నెలతో పోలిస్తే సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2021 డిసెంబర్ నెలలో 19.98 శాతం పెరిగింది. 14.60 లక్షల మంది సబ్‌స్క్రైబర్లలో 9.11 లక్షల మంది ఈపీఎఫ్ఓ అండ్ ఎంపీ చట్టం, 1952 కింద మొదటిసారి నమోదు చేసుకున్నారు.

ఈపీఎఫ్ఓలోకి తిరిగి వచ్చిన సబ్‌స్క్రైబర్ల సంఖ్య 5.419 లక్షలు. అంతకుముందు పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని ప్రస్తుత ఖాతాకు బదలీ చేసుకున్నారు. ఇప్పుడు కొత్త ఖాతాను కొనసాగిస్తున్నారు. గణాంకాల ప్రకారం 2021 డిసెంబర్ నెలలో నమోదైన సబ్‌స్క్రైబర్లు 22 ఏళ్ల నుండి 25 ఏళ్ల మధ్య వయస్సు వారు అత్యధికంగా 3.87 లక్షల మంది, 18 ఏళ్ల నుండి 21 ఏళ్ల వయస్సు మధ్య వారు 2.97 లక్షల మంది.

2021 డిసెంబర్ నెలలో 18 ఏళ్ల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారి వాటా 46.89 శాతంగా ఉంది. ఉద్యోగుల పదవీ విరమణపై ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ప్రయోజనాలు అందిస్తుంది ఈపీఎఫ్. సబ్‌స్క్రైబర్ అకాలమరణం చెందితే కుటుంబ సభ్యులకు, పెన్షన్, బీమా సదుపాయం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Gold Price: 2026లో తులం బంగారం ఎంత కానుందంటే.. తెలిస్తే వెంట‌నే కొనేస్తారు