అంబానీ పెళ్లి కార్డ్ అదిరిందిగా.. ఇలాంటిది మరెక్కడా చూసి ఉండరు.. వీడియో వైరల్

By Ashok Kumar  |  First Published Jul 2, 2024, 9:22 AM IST

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ లాగానే పెళ్లి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తాజాగా ముఖేష్ అంబానీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు మ్యారేజ్ కార్డ్ ఇచ్చేందుకు వెళ్లగా, నీతా అంబానీ వారణాసి వెళ్లి కాశీ విశ్వనాథ్‌ గుడిలో ఫస్ట్ కార్డు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.


రాధిక మర్చంట్‌తో ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైంది. జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ జంట పెళ్లి చేసుకోనున్నారు. వీరిద్దరి పెళ్ళికి  దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. 

ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ లాగానే పెళ్లి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తాజాగా ముఖేష్ అంబానీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు మ్యారేజ్ కార్డ్ ఇచ్చేందుకు వెళ్లగా, నీతా అంబానీ వారణాసి వెళ్లి కాశీ విశ్వనాథ్‌ గుడిలో ఫస్ట్ కార్డు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.

Latest Videos

పెళ్లికి ముందు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ఆహ్వానానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అవును, పెళ్లి తేదీ దగ్గర పడింది ఇంకా పెళ్లి సన్నాహాల మధ్య అంబానీ కుటుంబం పెళ్లి కార్డులను అందరికి  ఇస్తుంది. వీవీఐపీ అతిథులకు కుటుంబ సభ్యులు స్వయంగా కార్డులు ఇస్తున్నారు. దీనితో పాటు కార్డ్ ఫస్ట్ లుక్ కూడా బయటికి వచ్చింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి కార్డు చాలా ప్రత్యేకమైనది కూడా.


వెడ్డింగ్ ఇన్విటేషన్  లైట్లతో అలంకరించిన ప్రత్యేక బాక్స్ లో గుడి ఉంది. దాన్ని తెరిచినప్పుడు శ్లోకం బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంది. బాక్స్ లోని గుడి  నాలుగు దిక్కులలో బంగారు విగ్రహాలు కనిపిస్తాయి. గణపతి, రాధా-కృష్ణుడు, దుర్గాదేవిని చూడవచ్చు. ఇది నిజంగా అద్భుతం ఇంకా సంప్రదాయ కళాఖండం.

బాక్స్ లోని గుడి  వెండి తలుపులు తెరిస్తే  పెళ్లి కార్డు ఉంటుంది, మీరు కార్డును తెరిచిన తర్వాత గణేశుడు, విష్ణువు, లక్ష్మి, రాధా-కృష్ణుడు,  దుర్గాదేవితో సహా వివిధ హిందూ దేవతల ఫోటోలను  చూడవచ్చు. అందులో అనంత్ రాధిక పెళ్లి వేడుక వివరాలు ఉంటాయి. అనంత్ - రాధిక పెళ్లి కార్డ్‌తో పాటు కొన్ని  గిఫ్ట్స్ కూడా ఉన్నాయి.

జూలై 12, శుక్రవారం పెళ్లి వేడుకతో ముఖ్య కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దీని తర్వాత జూలై 13న శుభ ఆశీర్వాద లేదా దైవిక ఆశీర్వాద కార్యక్రమం జరుగుతుంది. జూలై 14న మంగళ్ ఉత్సవ్ లేదా పెళ్లి రిసెప్షన్‌ ఉంటుంది.

ఈ ఏడాది జూన్‌లో రాధిక మర్చంట్ - అనంత్ అంబానీ ఐరోపాలో లగ్జరీ వెకేషన్‌లో సెకండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం అంబానీ కుటుంబం దాదాపు 1200 మంది అతిథులకు ఆతిథ్యం ఇచ్చింది. అంతకుముందు అంబానీ కుటుంబం ఈ ఏడాది మార్చిలో జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ను నిర్వహించింది.

 

click me!