జెట్ ఎయిర్‌వేస్‌కు మరో దెబ్బ: రేపటి నుంచి 1,100 మంది పైలట్ల సమ్మె

By Siva KodatiFirst Published Apr 14, 2019, 5:46 PM IST
Highlights

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో షాక్ తగిలింది. సోమవారం నుంచి దాదాపు 1000 మంది పైలట్లు సమ్మె బాట పట్టనున్నారు. 

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో షాక్ తగిలింది. సోమవారం నుంచి దాదాపు 1,100 మంది పైలట్లు సమ్మె బాట పట్టనున్నారు. తమకు వేతనాల బకాయిల చెల్లించనందుకు నిరసనగా విధులకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ పేర్కొంది.

వీరితో పాటు ఇంజనీర్లు, సీనియర్ మేనేజ్‌మెంట్‌కు జనవరి నెల వేతనాలు అందలేదు. ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు చెల్లించలేదు. కాగా ఏప్రిల్ 1 నుంచే సమ్మె చేయాలని నిర్ణయించుకున్నప్పటికి, గోయల్ తప్పుకోవడంతో పాటు ఎస్‌బీఐ కన్సార్టియం రంగంలోకి దిగడంతో సమ్మెను విరమించుకున్నారు.

అయితే సోమవారం నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధర్నాకు వారు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పైలట్లు మాట్లాడుతూ... తమకు మూడున్నర నెలలకు సంబంధించి వేతనాలు రావాల్సి ఉందని, ఈ డబ్బులు తమకు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పడం లేదని తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. 

click me!