‘ఈ-కామర్స్’ రిలయన్స్ లక్ష్యం: 25 సంస్థల టేకోవర్ వ్యూహం

By Siva KodatiFirst Published Apr 14, 2019, 10:41 AM IST
Highlights

భారతదేశంలో ఈ -కామర్స్ రంగంలో పట్టు సాధించేందుకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రణాళికలు రూపొందించారు. సుమారు 24 నుంచి 25 సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్ అడుగులేస్తున్నది. 

ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ ‘ఈ-కామర్స్’ రిటైల్ మార్కెట్లోకి అడుగులు పెట్టేందుకు తన వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే ఈ-కామర్స్‌లో అగ్రగామి సంస్థగా పేరొందిన అమెజాన్‌ను ఢీ కొట్టేందుకు రంగం సిద్దం అవుతున్నారు. 

ఇప్పటికే ‘రిటైల్’ ఈ-కామర్స్ బిజినెస్‌లో పని చేస్తున్న సుమారు 24 నుంచి 25 సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడులతో వాటిని టేకోవర్ చేసేందుకు 2.5 బిలియన్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టారు ముకేశ్ అంబానీ. జియో పేరిట‘4జీ’తో టెలికం రంగంలో చౌక ధరకే ఫోన్ సేవలు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 

ఇప్పటికే అమెజాన్, వాల్‌మార్ట్ అనుబంధ ఫ్లిప్‌కార్ట్ మధ్య ఆఫర్ల యుద్ధం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో టాలెంటెడ్ పీపుల్‌తో కూడిన టీం వివిధ సంస్థల ఆక్విజన్ కొనసాగుతున్నదని విశ్లేషకులు తెలిపారు. 

2028 నాటికి ‘ఈ-రిటైల్’ మార్కెట్ 200 బిలియన్ల డాలర్లకు పెరుగుతున్నది. గతేడాది కంటే ఈ ఏడాది 30 బిలియన్ల డాలర్లు మార్కెట్ పెరిగిన ‘ఈ-కామర్స్’లో పట్టు కోసం సాగే రేస్‌లో ముకేశ్ అంబానీ ముందు ఉన్నారని మొర్గాన్ స్టాన్లీ పేర్కొంది.

సిస్కో సిస్టమ్స్ అంచనా ప్రకారం భారతదేశంలో స్మార్ట్ ఫోన్ యూజర్లు 829 మిలియన్లకు చేరుకుంటాయి. ఈ ఏడాది 50 కోట్ల మందికి చేరతారని అంచనా. అలాగే మ్యూజిక్ నుంచి ఫుడ్ డెలివరీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, దుస్తుల వరకు ఆన్ లైన్ కొనుగోళ్లలో డిమాండ్ ఉందని తెలుస్తోంది. 

గతేడాది జూలైలో ముకేశ్ అంబానీ తన ప్లాన్‌ను బయటపెట్టారు. ప్రస్తుతం అన్ లిస్టెడ్ బిజినెస్ ‘రిలయన్స్ రిటైల్’, ‘రిలయన్స్ జియో ఇన్ఫోకామ్’ కలగలిపి ‘రిలయన్స్ ఈ-కామర్స్’లో వినియోగిస్తారు. ఇదే వేదికను రియాల్టీలో అడుగు పెట్టేందుకు వాడనున్నారు. 

2028 నాటికి రిలయన్స్ కన్జూమర్ బిజినెసెస్ బ్రెడ్ అండ్ బట్టర్, ఎనర్జీ బిజినెస్ వరకు అన్ని రంగాల్లో అడుగు పెట్టాలన్నదే ముకేశ్ అంబానీ వ్యూహం. ఇండియన్ మార్కెట్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న లక్షల్లో ఉన్న మామ్ అండ్ పాప్ స్టోర్ బోర్డులోకి అడుగు పెట్టాలని భావిస్తోంది. 

రిలయన్స్ ఈ-కామర్స్ వేదిక స్మాల్ మర్చంట్స్‌ను లార్జ్ ఎంటర్ ప్రైజెస్‌గా డెవలప్ అయ్యేందుకు అవసరమయ్యే చర్యలన్నీ చేపట్టింది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ‘ఈ-కామర్స్’ రంగానికి సంబంధించిన తమ ప్రణాళికలను, వాటి పురోగతిని వెల్లడించడానికి నిరాకరించారు. 

‘ఇంటర్నెల్ ఆఫ్ థింక్స్’లో పట్టు న్న రాడిస్య్స్ కార్ప్ 5జీ విభాగంలో రిలయన్స్ విస్తరించడానికి సహకరించడంతోపాటు బ్రాడర్ ఈ-కామర్స్ బిజినెస్‌లో అడుగు పెట్టేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. 

click me!