నగదు విత్ డ్రాపై షరతులు...పెట్రోల్ బంక్ యజమానులకు కష్టాలు...

By Sandra Ashok KumarFirst Published Mar 8, 2020, 2:19 PM IST
Highlights

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం యెస్ బ్యాంకు ఖాతాదారులకు నగదు విత్ డ్రాలపై పై తాత్కాలిక పరిమితిని విధించింది. ఒక నెలపాటు వారి ఖాతా నుండి రూ .50 వేలకు మించి విత్ డ్రా చేసుకోకుండా పరిమితం చేసింది.

న్యూ ఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం యెస్ బ్యాంక్‌ ఖాతాదారుల నగదు 50 వేల కంటే ఎక్కువ విత్ డ్రా చేయకుండా తాత్కాలిక నిషేధం విధించిన తరువాత యెస్ బ్యాంక్‌లో ఖాతాలున్న పెట్రోల్ పంప్ యజమానులు చమురు కంపెనీలకు డబ్బులు చెల్లింపులు చేయడానికి చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

పెట్రోల్ పంప్ యజమానులు సాధారణంగా కరెంట్ ఖాతాలను ఉపయోగిస్తుంటారు ఎందుకంటే ప్రతి యజమాని చమురు కంపెనీకి రోజుకి సుమారు రూ .30-40 లక్షలు చెల్లిస్తుంటారు. యెస్ బ్యాంక్ సంక్షోభం తరువాత యెస్ బ్యాంకులో ఖాతాలు ఉన్న పెట్రోల్  బంక్ యజమానులు చమురు కంపెనీలకు డబ్బులు చెల్లించటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

also read హెచ్1బీ వీసాల్లో మార్పులు : వచ్చేనెల నుంచే అమలు!

పెట్రోల్ బంకుల్లో సాధారణంగా పెట్రోల్ స్టాక్  4-5 రోజులకు సరిపడే అంతా ఉంటుంది. అందువల్ల ఇంకా బంకులు మూసివేయలేదు. కానీ ఇలాంటి పరిస్థితిలో వారు ఎంతకాలం  అని వేచి చూస్తారు. బంకుల్లో స్టాక్ అయిపోయాక నగదు విత్ డ్రా పై ఇలాంటి షరతులు విధిస్తే తాము ఆయిల్ కంపెనీలకు డబ్బులు ఎలా చెల్లించగలము చివరికి బంకులు మూసివేయాల్సిన పరిస్థితులు వస్తాయని వాపోతున్నారు.

మొత్తం 15 పెట్రోల్ బంక్ యజమానులు యెస్ బ్యాంక్ ఖాతాలపై పూర్తిగా ఆధారపడి ఉన్నారని ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు. 2015 లో యెస్ బ్యాంక్ బంచ్ నోట్ అక్సెప్టర్ (బిఎన్‌ఎ) మెషిన్లను ప్రవేశపెట్టిన తరువాత పెట్రోల్ బంక్ యజమానులు యెస్ బ్యాంక్‌ను ఎంచుకున్నారు. 

also read తెలంగాణ వార్షిక బడ్జెట్ 2020 -21లో కేటాయించిన నిధులు...

ఈ మెషిన్ల ద్వారా పెట్రోల్  బంక్ యజమానులకు భారీ మొత్తంలో డబ్బును జమ చేయడానికి సహాయపడతాయి. తద్వారా  నగదును బ్యాంకు  తీసుకెళ్లడం వంటి ఇబ్బందులు ఉండవు. ఆ సమయంలో ఈ సదుపాయాన్ని కల్పించిన ఏకైక బ్యాంక్ యెస్ బ్యాంక్. తరువాతి సంవత్సరాల్లో యెస్ బ్యాంక్ పై నమ్మకం పెరగడంతో, బంక్ యజమానులు ఇతర బ్యాంకుల నుండి కూడా డబ్బును తీసి  యెస్ బ్యాంక్ లోని జమ చేశారు.

click me!