Petrol Diesel Prices Today: వాహనదారులకు భారీ ఊరట.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర ఎంతంటే..?

Published : May 03, 2022, 09:38 AM IST
Petrol Diesel Prices Today: వాహనదారులకు భారీ ఊరట.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర ఎంతంటే..?

సారాంశం

గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి.  

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 27వ రోజు స్థిరంగా ఉన్నాయి. మంగళ‌వారం, మే 3వ తేదీన ధరల్లో ఎలాంటి మార్పులేదు. చివరిసారి ఏప్రిల్ 6వ తేదీన‌ లీటర్ పెట్రోల్ పైన 80 పైసలు పెరిగింది. మార్చి 22వ తేదీ నుండి పక్షం రోజుల పాటు మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, లీటర్ డీజిల్ ధర రూ.96.67 వద్ద ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.105.86, డీజిల్ రూ.97.10గా ఉంది.

మంగళ‌వారం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశీ ఇంధన ధరలు నిలకడగా ఉండ‌టం ఇది వరుసగా 27వ రోజు కావడం గమనార్హం. వాహనదారులకు ఇది భారీ ఉపశమనం. అయితే పెట్రోల్, డీజల్ రేట్లు ఏప్రిల్‌ నెలలో లీటరుకు రూ.3.6 మేర పైకి చేరింది. కాగా హైదరాబాద్‌లో నేటి రేట్ల విషయానికి వస్తే.. పెట్రోల్ రూ.119.49 వద్ద, డీజిల్ రూ.105.49 వద్ద ఉన్నాయి. విజయవాడలో లీటర్‌ పెట్రోల్ ధర నేడు రూ.121.60గా ఉంది. డీజిల్ లీట‌ర్‌ రూ.107.18 వ‌ద్ద‌ ఉంది. 

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి మంగళ‌వారం (మే 3, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా మంగళ‌వారం కూడా ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.41 కాగా, డీజిల్‌ రూ. 96.67 వద్ద కొనసాగుతోంది.
 
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 120.51 కాగా, డీజిల్‌ రూ. 104.77గా ఉంది.
 
- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.85 కాగా, డీజిల్ రూ. 100.94గా నమోదైంది. 

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 111.09 కాగా, డీజిల్‌ రూ. 94.79 వద్ద కొనసాగుతోంది.
 
- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 115.12 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 99.83గా ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 119.49 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 105.49గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.121.60కాగా, డీజిల్‌ రూ. 107.18గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగినందున ధరలు మరింత ఎగుస్తాయని అంచనాలున్నాయి. దీంతో దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగి, గ్రోత్‌పై ప్రభావం చూపనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అవసరాలపై ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు. 

మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

LPG New Rules From August: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్ ఛేంజ్.. మీ లైఫ్‌ను ఈజీ చేసే 6 కొత్త అప్‌డేట్స్ ఇవే
Gold Price Hike: పరుగులు పెడుతున్న బంగారం..పూర్తిగా తగ్గని అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు