Petrol Diesel Prices Today: వాహనదారులకు ఊరట.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..!

Published : Apr 10, 2022, 08:30 AM IST
Petrol Diesel Prices Today: వాహనదారులకు ఊరట.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..!

సారాంశం

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం, ఏప్రిల్ 10వ తేదీన ధరల్లో ఎలాంటి మార్పులేదు. చివరిసారి బుధవారం (ఏప్రిల్ 6) రోజున లీటర్ పెట్రోల్ పైన 80 పైసలు పెరిగింది. మార్చి 22వ తేదీ నుండి పెరుగుదల ప్రారంభమైంది.   


ఏప్రిల్ 10 ఆదివారం రోజున కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశీ ఇంధన ధరలు నిలకడగా ఉంటూ రావడం ఇది వరుసగా 4వ రోజు కావడం గమనార్హం. వాహనదారులకు ఇది కొంచెం ఉపశమనం కలిగించే అంశం. అయితే పెట్రోల్, డీజల్ రేట్లు ఈ నెలలో ఇప్పటి దాకా చూస్తే లీటరుకు రూ.3.6 మేర పైకి చేరింది. గత నెలలో ఇంధ‌న‌ రేట్లు రూ.6.4 మేర పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో నేటి రేట్ల విషయానికి వస్తే.. పెట్రోల్ రూ.119.49 వద్ద, డీజిల్ రూ.105.49 వద్ద ఉన్నాయి. గుంటూరులో లీటర్‌ పెట్రోల్ రేటు రూ.121.26 వద్ద ఉంది. డీజిల్ కొనాలంటే రూ.106.87 చెల్లించాలి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి ఆదివారం (ఏప్రిల్ 10, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా ఆదివారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.41 కాగా, డీజిల్‌ రూ. 96.67 వద్ద కొనసాగుతోంది.
 
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 120.51 కాగా, డీజిల్‌ రూ. 104.77గా ఉంది.
 
- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.85 కాగా, డీజిల్ రూ. 100.94గా నమోదైంది. 

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 111.09 కాగా, డీజిల్‌ రూ. 94.79 వద్ద కొనసాగుతోంది.
 
- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 115.08 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 99.82గా ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 119.49 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 105.49గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 121.63కాగా, డీజిల్‌ రూ. 107.21గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగినందున ధరలు మరింత ఎగుస్తాయని అంచనాలున్నాయి. దీంతో దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగి, గ్రోత్‌పై ప్రభావం చూపనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అవసరాలపై ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు.

మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి