Google:ఉద్యోగులకు గూగుల్ గుడ్ న్యూస్.. వారంలో 2 రోజులైన ఆఫీసుకి వస్తే ఎలక్ట్రిక్ స్కూటర్..

Ashok Kumar   | Asianet News
Published : Apr 09, 2022, 06:43 PM IST
Google:ఉద్యోగులకు గూగుల్ గుడ్ న్యూస్.. వారంలో 2 రోజులైన ఆఫీసుకి వస్తే ఎలక్ట్రిక్ స్కూటర్..

సారాంశం

ఇ-స్కూటర్‌కు అర్హత సాధించేందుకు గూగుల్ ఉద్యోగులు నెలలో తొమ్మిది రోజులు ఆఫీసులకి రావాల్సి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. టెక్ దిగ్గజం ఒక్కో యూనిట్‌కి $50 (సుమారు రూ. 3800) ఎన్‌రోల్‌మెంట్ చార్జ్, ప్రతి ఉద్యోగికి డిస్కౌంట్ $44.10 (సుమారు రూ. 3346) నెలవారీ చార్జ్ చెల్లిస్తుంది.

ప్రపంచ టెక్నాలజి దిగ్గజం గూగుల్ (Google)  యూ‌ఎస్ లోని బే ఏరియాతో సహ ఇతర ప్రదేశాలలో ఉన్న  ఉద్యోగులను తిరిగి ఆఫీసులకి రావాలని కోరుతున్నట్లు నివేదించబడింది. అయితే ప్రతిరోజూ కాకుండా ప్రతి వారం కొన్ని రోజులు మాత్రమే అని తెలిపింది. దీని కోసం కంపెనీ ఉద్యోగులకు  ఎలక్ట్రిక్ స్కూటర్ల నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను అందించింది. US మీడియా నివేదికల ప్రకారం, ఆఫీసులకి తిరిగి రావడానికి ఎంచుకునే ఉద్యోగులకు ఇ-స్కూటర్‌లను అందించడానికి గూగుల్ యునాగి (Unagi)తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇ-స్కూటర్‌కు అర్హత సాధించేందుకు గూగుల్ ఉద్యోగులు నెలలో తొమ్మిది రోజులు ఆఫీసులకి రావాల్సి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. టెక్ దిగ్గజం ఒక్కో యూనిట్‌కి $50 (సుమారు రూ. 3800) ఎన్‌రోల్‌మెంట్ చార్జ్, ప్రతి ఉద్యోగికి డిస్కౌంట్ $44.10 (సుమారు రూ. 3346) నెలవారీ చార్జ్ చెల్లిస్తుంది. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ ట్రెడిషనల్ బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాల లాగా కాదు,  అయితే యునాగి మోడల్ వన్. 

యునాగి మోడల్ వన్‌లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి, ఈ మోటర్లు 1.3 హెచ్‌పి పవర్, 32 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 32 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే దాదాపు 25 కి.మీల దూరం ప్రయాణించవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల పరిచయం చాలా కాలం పాటు హోమ్ షెడ్యూల్ తర్వాత ఉద్యోగులను తిరిగి ఆఫీసులకి తీసుకురావడానికి ఒక కొత్త మార్గం. COVID-19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో 2020 ప్రారంభంలో గూగుల్ వర్క్ ఫ్రమ్ హోమ్  ప్రారంభించింది. 

ఉనాగి వ్యవస్థాపకుడ, సి‌ఈ‌ఓ డేవిడ్ హైమాన్ మాట్లాడుతూ "ఉద్యోగులలో భయాందోళనలు ఉన్నాయని గూగుల్ కి తెలుసు. ప్రజలు నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం అలవాటు చేసుకున్నారు. అయితే వారు తిరిగి ఆఫీసులకి వచ్చే అనుభవాన్ని మెరుగుపరచడానికి  మేము చేయగలిగినదంతా చేస్తున్నాము. ఇతర కంపెనీలు కూడా దీనిని అనుసరిస్తాయని మేము ఆశిస్తున్నాము. ఇది ఆఫీసులకి గొప్ప ప్రయోజనం అని మేము భావిస్తున్నాము."అని అన్నారు.

నివేదిక ప్రకారం, ఈ ఆఫర్ అందుబాటులో ఉండే ప్రదేశాలలో గూగుల్ మౌంటైన్ వ్యూ ప్రధాన కార్యాలయంతో పాటు సీటెల్, కిర్క్‌ల్యాండ్, ఇర్విన్, సన్నీవేల్, ప్లేయా విస్టా, ఆస్టిన్, న్యూయార్క్ సిటీ ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు