Petrol Diesel Prices Today: దూసుకుపోతున్న ధరలు.. రూ. 120 దాటిన పెట్రోల్‌..!

Published : Apr 05, 2022, 08:19 AM IST
Petrol Diesel Prices Today: దూసుకుపోతున్న ధరలు.. రూ. 120 దాటిన పెట్రోల్‌..!

సారాంశం

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు మంగళ‌వారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 80 పైసలు చొప్పున పెరిగాయి.   

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు మంగళ‌వారం (ఏప్రిల్ 5, 2022) పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై 80 పైసలు చొప్పున పెరిగాయి. వ‌రుస‌గా 15 రోజుల్లో పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గడం ఇది 13వ సారి. అయితే రాష్ట్ర ట్యాక్స్‌లు క‌లుపుకుని ఏపీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 120 దాటింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.118.59కి చేరింది. లీటర్ డీజిల్‌ ధర రూ.104.62కి చేరింది. గత 15 రోజుల్లో లీటరు పెట్రోల్ పై ధర రూ.9.20 పెరిగింది. విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 120 దాటింది.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి మంగళ‌వారం (ఏప్రిల్ 05, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా మంగళ‌వారం ధ‌ర‌ల్లో మార్పు చోటుచేసుకున్నాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 104.61 కాగా, డీజిల్‌ రూ. 95.87 వద్ద కొనసాగుతోంది.

- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 119.67 కాగా, డీజిల్‌ రూ. 103.92గా ఉంది.

-  చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.09 కాగా, డీజిల్ రూ. 100.18గా నమోదైంది.

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 110.25 కాగా, డీజిల్‌ రూ. 94.01 వద్ద కొనసాగుతోంది.

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 114.28 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 99.02గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 118.59 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 104.62గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 120.66కాగా, డీజిల్‌ రూ. 106.29కి చేరింది.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు.  మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Ginger Tea: పక్కా కొలతలతో బెస్ట్ అల్లం టీ..చివరి గుటక వరకు అదే రుచి
Cheap Gold: బంగారం ఇక్కడ డెడ్ చీప్...తరుగు, మేకింగ్ ఛార్జీలు కూడా తక్కువే, ఇప్పుడే వెళ్లి కొనేయండి