Petrol Diesel Prices Today: మ‌రోసారి పెట్రో మంట‌.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ ఎంతో తెలుసా..?

Published : Apr 03, 2022, 08:23 AM IST
Petrol Diesel Prices Today: మ‌రోసారి పెట్రో మంట‌.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ ఎంతో తెలుసా..?

సారాంశం

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు  ఆదివారం (ఏప్రిల్ 3, 2022) పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఆదివారం రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 80 పైసలు చొప్పున పెరిగాయి.   

పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం (ఏప్రిల్ 03, 2022) మ‌రోసారి పెరిగాయి. ఆదివారం ఆయిల్ కంపెనీలు మ‌రోసారి వాహ‌న‌దారుల‌కు షాకిచ్చాయి. వ‌రుస‌గా 13 రోజుల్లో పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గడం ఇది 11వ సారి. చ‌మురు సంస్థలు  లీట‌ర్ పెట్రోల్‌పై 80 పైస‌లు, డీజిల్‌పై 80 పైస‌లు చొప్పున పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 80 పైసలు చొప్పున పెరిగాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు పెరిగి రూ.117.23కి చేరింది. లీటర్ డీజిల్‌ ధర 87 పైసలు పెరిగి రూ.103.32కి చేరింది. మొత్తంగా 11 రోజుల్లో లీటరుపై సుమారు రూ.8 వరకు చమురు ధరలు పెంచారు.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి ఆద‌వారం (ఏప్రిల్ 03, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా ఆదివారం ధ‌ర‌ల్లో మార్పు చోటుచేసుకున్నాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 103.41 కాగా, డీజిల్‌ రూ. 94.67 వద్ద కొనసాగుతోంది.

- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 118.41 కాగా, డీజిల్‌ రూ. 102.64గా ఉంది.

-  చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 108.21 కాగా, డీజిల్ రూ. 99.04గా నమోదైంది.

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 108.99 కాగా, డీజిల్‌ రూ. 92.83 వద్ద కొనసాగుతోంది.

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 113.03 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 97.82గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 117.23 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 103.32గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 118.15కాగా, డీజిల్‌ రూ. 105.50కి చేరింది.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు.  మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.
 

PREV
click me!

Recommended Stories

Bank holidays: 14 రోజులు బ్యాంకులు బంద్.. ఆగస్టు బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ న్యూస్.. ఆ తేదీ నుంచే భారీగా పెరగనున్న జీతాలు !