Federal bank: రాకేష్ జున్ జున్ వాలా పోర్టు ఫోలియోలోని బ్యాంకింగ్ స్టాక్ ఇదే...కొనాలా...వద్దా..ఓ లుక్కేయండి..

Published : Apr 02, 2022, 06:56 PM IST
Federal bank: రాకేష్ జున్ జున్ వాలా పోర్టు ఫోలియోలోని బ్యాంకింగ్ స్టాక్ ఇదే...కొనాలా...వద్దా..ఓ లుక్కేయండి..

సారాంశం

స్టాక్ మార్కెట్లో బిగ్ బుల్ రాకేష్ జున్ జున్ వాలా పోర్టు ఫోలియో అంటే ప్రతీ ఒక్కరూ కన్నేసి ఉంచుతారు. అంతేనా ఈ స్టాక్స్ ఎప్పటికైనా మల్టీ బ్యాగర్లుగా ఎదుగుతాయని ప్రతీ ఇన్వెస్టర్ ఆశగా ఎదురుచూస్తుంటాడు. అయితే రాకేష్ జున్ జున్ వాలా ఇటీవల ఓ బ్యాంకింగ్ స్టాక్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బు సంపాదించాలని ఆశించే ప్రతీ ఒక్కరూ...అయితే ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్ జున్ వాలా పోర్టు ఫోలియోపై ఓ కన్నేసి ఉంచుతారు. కొందరు ఇన్వెస్టర్లు ఆయనను గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. ముఖ్యంగా మార్కెట్‌లోని రాకేష్ జున్ జున్ వాలా మల్టీ బ్యాగర్ స్టాక్‌లను గుర్తించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. బిగ్ బుల్ రాకేష్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్‌ల కోసం సాధారణ ఇన్వెస్టర్ తప్పనిసరిగా వెతకడానికి ఇదే కారణం.

మీకు రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోపై కూడా ఆసక్తి ఉంటే, మీరు ఫెడరల్ బ్యాంక్ స్టాక్‌ పై (Federal Bank share) ఓ కన్నేసి ఉంచండి. బ్రోకరేజ్ హౌస్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ బ్యాంక్ సెక్టార్‌పై తన తాజా నివేదికలో ఫెడరల్ బ్యాంక్ స్టాక్‌ విషయంలో బయ్ చేయమని  (కొనుగోలు) సలహా ఇచ్చింది. బ్యాంకింగ్ రంగంలో మరింత వృద్ధికి అన్ని అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజ్ చెబుతోంది. ఇది ఫెడరల్ బ్యాంక్ స్టాక్‌ను కూడా బలోపేతం చేస్తుంది.

ఫెడరల్ బ్యాంక్ డిసెంబర్ త్రైమాసిక డేటా ప్రకారం, రాకేష్ జున్‌జున్‌వాలా ఫెడరల్ బ్యాంక్‌లో 3.7 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆయన బ్యాంకులో 75,721,060 షేర్లను కలిగి ఉన్నాడు. జూన్ త్రైమాసికంలో ఆయనకు 2.8 శాతం వాటా ఉంది. ఈ విధంగా, రాకేశ్ డిసెంబర్ త్రైమాసికం వరకు ఫెడరల్ బ్యాంక్‌లో తన వాటాను పెంచుకున్నాడు.

ఈ కారణంగా ఒక జంప్ ఉంటుంది
 బ్రోకరేజ్ హౌస్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ (ICICI Securities) నివేదిక ప్రకారం బ్యాంకింగ్ రంగం క్రెడిట్ వృద్ధి వలన ప్రభావితం అవుతోంది. నిజానికి ఆస్తుల నాణ్యతకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి బ్యాంకింగ్ రంగం కూడా చాలా సమయం పట్టింది. రిజర్వ్ బ్యాంక్ అనేక నియంత్రణ చర్యల తర్వాత, ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి ఇప్పుడు కొంత వరకు తగ్గింది. FY22 నుండి బ్యాంకింగ్ క్రెడిట్ వృద్ధి మెరుగుపడుతుండగా, రిటైల్ విభాగం కూడా మంచి వృద్ధిని సాధిస్తోంది. రానున్న రోజుల్లో బ్యాంకు రుణ వృద్ధి మరింత మెరుగుపడనుంది. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం వల్ల బ్యాంకింగ్ రంగం కూడా లాభపడనుంది.

టార్గెట్ ధర రూ. 120
బ్యాంకింగ్ రంగంలో మెరుగుదల ఫెడరల్ బ్యాంక్ స్టాక్‌పై కూడా ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఈ స్టాక్ ఇప్పటి వరకు ఇన్వెస్టర్లకు 15 శాతం రాబడిని ఇచ్చింది. అదే సమయంలో, ఫెడరల్ బ్యాంక్ స్టాక్ ఏడాది వ్యవధిలో 28 జంప్ చేసింది. బ్రోకరేజ్ హౌస్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 120 రూపాయల లక్ష్యంతో స్టాక్‌లో పెట్టుబడి సలహా ఇచ్చింది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో ఫెడరల్ బ్యాంక్ షేరు రూ.101.30 (ఫెడరల్ బ్యాంక్ షేర్ ధర) వద్ద ముగిసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు