Petrol Diesel Prices Today: నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే.. తగ్గాయా..? పెరిగాయా..?

Published : Mar 10, 2022, 08:48 AM IST
Petrol Diesel Prices Today: నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే.. తగ్గాయా..? పెరిగాయా..?

సారాంశం

హైదరాబాద్‌లో గురువారం (మార్చి 10, 2022) పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా ఉంది. దీంతో లీటరుకు పెట్రోల్ ధర రూ. 108.20 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ రేటు కూడా స్థిరంగా ఉంది.. 

పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని నగరాల్లో పెరిగినప్పటికీ, మొత్తానికి స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసినట్లుగా కనిపించడంతో బ్రెంట్ 112 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 109 డాలర్లకు తగ్గింది. ఓ సమయంలో 130 డాలర్లు క్రాస్ చేశాయి. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, ఎన్నికల కారణంగా నాలుగు నెలలుగా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (మార్చి 10, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. 

ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి. బడ్జెట్‌కు తర్వాత కూడా మన వద్ద స్థిరంగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు లేదా ఫలితాల తర్వాత ధరలు పెరుగుతాయని మొదటి నుండి వినిపిస్తున్న వార్తలు. రేపో మాపో పెరగవచ్చు. ధరలు ఎప్పుడైనా పెరగవచ్చుననే ఉద్దేశ్యంతో పెట్రోల్ బంకుల వద్ద జనాలు వరుస కడుతున్నారు. ఒకేసారి ట్యాంకు ఫుల్ చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


వివిధ న‌గ‌రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.24, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.37

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.07, డీజిల్ ధర  లీటర్ కు రూ. 91.61

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.13, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.67

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.27, డీజిల్ ధర లీటర్ కు రూ. 92.06

- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు.  మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.
 

PREV
click me!

Recommended Stories

UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు.? క్లారిటీ ఇచ్చిన‌ ఫోన్‌పే సీఈవో
Recharge plan: జియో యూజ‌ర్ల‌కు పండ‌గే.. రూ. 550కే 15 ఓటీటీ యాప్‌లు