Stock Market: మార్కెట్లకు ఉక్రెయిన్, ఎగ్జిట్ పోల్స్ బూస్ట్, సెన్సెక్స్ 1,223 పాయింట్లు జంప్...

Published : Mar 09, 2022, 05:57 PM IST
Stock Market: మార్కెట్లకు ఉక్రెయిన్, ఎగ్జిట్ పోల్స్ బూస్ట్, సెన్సెక్స్ 1,223 పాయింట్లు జంప్...

సారాంశం

Stock Market: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజుకూడా బుల్లిష్ ధోరణిని చూపిస్తున్నాయి. బుధవారం మార్కెట్లో అనూహ్యమైన రికవరీ కనిపించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటోలో చేరడం లేదనే ప్రకటనతో యుద్ధం దాదాపు ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో మార్కెట్లు పాజిటివ్ గా స్పందిస్తున్నాయి.    

ఉక్రెయిన్ ప్రెసిడెంట్  జెలెన్స్కీ NATO సభ్యత్వం కోసం పట్టుబట్టడం లేదని వార్తలు, అలాగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలతో, మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. దీంతో బుధవారం మార్చి 9న, భారత స్టాక్ మార్కెట్లు  వరుసగా రెండవ రోజు కూడా బుల్లిష్‌గా ఉన్నాయి. యుఎస్ ఫెడ్ వైఖరి కూడా మార్కెట్లు కోలుకోవడానికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రోజంతా బుల్లిష్ గా సాగిన మార్కెట్లు ట్రేడింగ్ ముగిసిన తర్వాత గ్రీన్‌లో కనిపించాయి. సెన్సెక్స్ 1,223 పాయింట్లు, 2.30 శాతం లాభపడి 54,647 వద్ద ముగియగా, నిఫ్టీ 332 పాయింట్లు మెరుగుపడి 16,345 వద్ద ముగిసింది.

మార్కెట్లో రికవరీకి ప్రధాన కారణాలను ఇవే...

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
మార్చి 10న జరగనున్న ఎన్నికల ఫలితాల కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఒక వేళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రేపు నిజం అయితే మార్కెట్ సెంటిమెంట్ మరింత బలపడే అవకాశం ఉంది.

రష్యా-ఉక్రెయిన్ వివాదం తగ్గుదల
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో సభ్యత్వం కోసం పట్టుబట్టడం లేదని వార్తలు వచ్చాయి. నిజానికి ఈ అంశంపైనే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. అదే సమయంలో, జెలెన్స్కీ రష్యా తో "రాజీ" కు సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పారు.

ప్రభుత్వ విధానాలు
మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం ఉక్రెయిన్ సంక్షోభం, చమురు ధరల పెరుగుదల కారణంగా ఈక్విటీ మార్కెట్లు ఆశించిన స్థాయిలో పతనం కాలేదని  మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. కరోనా మహమ్మారి అనంతరం ప్రభుత్వం తీసుకున్న విధానాలతో  కొత్త లాభాల చక్రం సిద్ధమవుతోందని. చమురు ధరలు ఒక సవాలుగా ఉన్నప్పటికీ,  పాలసీ విషయంలో సమస్య లేదని పేర్కొంది.  అక్టోబరు 2021 నుండి ఎఫ్‌పిఐలు దేశీయ మార్కెట్లలో నిరంతరాయంగా విక్రయిస్తున్నప్పటికీ, మార్కెట్ అంతగా పడిపోలేదు. 

RBI పాలసీ..
RBI పాలసీ విషయంలో విశ్లేషకులు జాగ్రత్తగా ఉన్నారు. తదుపరి పాలసీ మీట్‌లో ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించడానికి RBI తీసుకునే చర్యల కోసం వేచి ఉన్నారు. బ్రెంట్ క్రూడ్ ధరలను 10 శాతం పెంచడం వల్ల వాస్తవ జిడిపి వృద్ధిపై 15 బిపిఎస్ తగ్గనుందని, ఆర్‌బిఐ గతంలో అంచనా వేసింది. బలహీనమైన జిడిపి వృద్ధి కారణంగా, ఆర్‌బిఐ రెపో రేటులో పెంపును ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధ భాగంలో (బహుశా అక్టోబర్) వాయిదా వేయవలసి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

GST కలెక్షన్స్..
ఫిబ్రవరిలో భారతదేశ GST వసూళ్లు 18 శాతం పెరిగి రూ.1.33 లక్షల కోట్లకు చేరుకున్నాయి. జీఎస్టీ రూ.లక్ష కోట్లు దాటడం వరుసగా ఇది ఐదో నెల.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే